spot_img
Monday, July 21, 2025
spot_img

నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు 60 వేల మంది ఫొటోలు సేకరించిన పోలీసులు.

ఆంధ్రప్రదేశ్ లో నేరగాళ్లపై ఉక్కు పాదం మోపేందుకు యాంత్రాంగం కొత్త టెక్నాలజీతో ముందుకు వస్తుంది దీనిలో భాగంగానే రౌడీషీటర్లు, నేరచరిత్ర ఉన్నవారిపై పోలీసులు ఫోకస్ పెంచారు. వారి కదలికలపై గట్టి నిఘా పెడుతున్నారు. ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌ ద్వారా వారి కదలికలను నిరంతరం గమనిస్తూ..నేరాలకు అడ్డుకట్ట వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నేరాలకు పాల్పడక ముందే నియంత్రించటం, నేరం చేస్తే వెంటనే అదుపులోకి తీసుకోవటం దీని ద్వారా సులభం అవుతుందని పోలీసులు చెబుతున్నారు.

ఏపీలో గత ఐదేళ్లలో నేరాలు విపరీతంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబా కీలక ఆదేశాలు ఇచ్చారు. నేరానికి పాల్పడిన వెంటనే పోలీసులకు పట్టుబడేలా సాంకేతిక వ్యవస్థను అమల్లోకి తీసుకురావాలని ఆదేశించారు. దీంతో ఏపీ పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవస్థను త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.

ఏపీలో 41 వేల 698 మంది హిస్టరీ షీటర్లు, 28 వేల 658 మంది రౌడీషీటర్లు ఉన్నారని పోలీస్ లెక్కలు చెబుతున్నాయి. వీరిలో దాదాపు 12 వేల మందికి సంబంధించి పాత ఫొటోలే పోలీసుల దగ్గర ఉన్నాయి. ప్రస్తుతం వారి ముఖ కవళికలు పూర్తిగా మారిపోయాయి. దీంతో ఎఫ్‌ఆర్‌ఎస్‌లో వారిని గుర్తించటం కష్టంగా మారింది. అందుకే ఇప్పుడు మళ్లీ వారి తాజా ఫొటోలు సేకరిస్తున్నారు. వీటిని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయనున్నట్టు పోలీసులు చెబుతున్నారు.ఏపీలోని ప్రధాన కూడళ్లు, బహిరంగ ప్రదేశాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 14 వేలకు పైగా కెమెరాల్లో 1000కి పైగా కెమెరాల్లో ఎఫ్‌ఆర్‌ఎస్‌ సాంకేతికత ఉంది. మిగతా 13 వేల కెమెరాల్లోనూ దాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన లైసెన్సులను పోలీసు శాఖ తీసుకుంటోంది. ప్రైవేట్ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకూ ఈ సాంకేతికతను పెట్టుకోవాలని ప్రోత్సహించనున్నట్టు పోలీసులు చెబుతున్నారు.

తాజాగా సేకరిస్తున్న వారి ఫొటోలన్నింటినీ.. వివరాలతో సహా పోలీస్‌ డేటా బేస్‌కు అనుసంధానం చేయనున్నారు. వాటిల్లో రికార్డయిన రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లు ఈ సీసీ కెమెరాలున్న ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరుగుతుంటే.. పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు, అక్కడి నుంచి సంబంధిత పోలీస్ స్టేషన్‌కు మెసేజ్ వెళ్తుండి. రౌడీషీటర్లు ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పటి నుంచి.. ఎక్కడెక్కడ తిరుగుతున్నారు? ఏం చేస్తున్నారు? ఎవరెవర్ని కలుస్తున్నారు? అనేది నిరంతరం గమనించే వెసులుబాటు కలుగుతుందని పోలీస్ అధికారులు వివరిస్తున్నారు. దీని ద్వారా నేరాలు తగ్గే అవకాశం ఉందని రిపీటెడ్ గా అదే నేరాలు చేస్తున్న వారికి చెక్కు పుట్టేందుకు అవకాశం ఉంటుందని పోలీసు యంత్రాంగం భావిస్తుంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular