మానవ సంబంధాలు రోజురోజుకీ దిగజారి పోతుండటం చూస్తూనే ఉన్నాం. దీనికి ప్రధాన కారణం పాశ్చాత్య దేశాల సంస్కృతిని గొప్పది అని భావించి అన్ని దేశాలు మన కల్చర్ ను పాటించడం మన గొప్పదనం గా భావించాలి..అలాంటి కల్చర్ ను చెడగొట్టే పద్ధతుల వైపునవాళ్ళు ఆకర్షితులు అవుతున్నారు..చేసేది తప్పైనా డేటింగ్, లివిన్ రిలేషన్‌షిప్ వంటి అందమైన పేర్లు పెట్టుకుని నాగరికత అంటూ గుట్టుచప్పుడు కాకుండా బతికేస్తున్నారు. కాగా ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు షుగర్ డాడీ. విదేశాల్లో ఫేమస్ అయిన ఈ వ్యవహారం క్రమేపీ భారత్‌లోనూ వ్యాపిస్తోంది.
పెద్ద వయస్సు కలిగిన, ఆర్థికంగా బలమైన ఓ వ్యక్తి చిన్న వయస్సులోని యువతితో రొమాంటిక్ బంధాన్ని కలిగి ఉంటే అతడిని షుగర్ డాడీగా పిలుస్తారు. ఈ రిలేషన్‌షిప్‌లో సదరు వ్యక్తి ఆమెకు అవసరమైన ఆర్థిక సాయం చేస్తాడు. ఈ సంబంధం పూర్తిగా పరస్పర ఒప్పందం మీద ఆధారపడి ఉంటుంది. షుగర్ డాడీ ఆ యువతికి ఆర్థిక భద్రత కల్పిస్తుండగా.. ఇందుకు ప్రతిఫలంగా ఆమె నుంచి స్నేహం, సాన్నిహిత్యం, ఎమోషనల్ లేదా ఫిజికల్ సంతృప్తి పొందుతాడు.షుగర్ డాడీలు సాధారణంగా సంపన్నులైన వ్యక్తులై ఉండి ఆర్థికంగా బలహీనంగా ఉన్న లేదా ప్రత్యేక సహాయం అవసరమయ్యే యువతులకి సాయం చేస్తారు. ఆర్థిక చిన్న వయస్సులోనే ఆర్థిక స్వాతంత్ర్యం పొందాలనుకునే ఆలోచనా విధానం ఈ సరహా రిలేషన్‌షిప్‌కు దారితీస్తున్నట్లు విశ్లేషణలు చెబుతున్నాయి. సాంప్రదాయ సంబంధాల కంటే ఇది భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఆర్థిక మరియు భావోద్వేగ పరమైన రిలేషన్‌షిప్ మధ్య స్పష్టమైన సమతుల్యత ఉంటుంది.
విద్య, జీవనశైలి మరియు కెరీర్ అభివృద్ధి కోసం పెరుగుతున్న ఖర్చులను అధిగమించేందుకు చాలా మంది యువతులపై ఆర్థిక ఒత్తిడి ఉంటుంది. ఒక షుగర్ డాడీని కలిగి ఉండటం ద్వారా వారి ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి ఇదొక మార్గంగా పాశ్చాత్య దేశాల్లో భావిస్తుంటారు. సోషల్ మీడియా మరియు డేటింగ్ యాప్స్ కూడా ఈ ట్రెండ్ మరింత పెరిగేందుకు ఊతమిస్తున్నాయి. వీటిద్వారా షుగర్ బేబీస్‌ను షుగర్ డాడీలు సులభంగా కనెక్ట్ అవగలుగుతున్నారు.సాధారణ సంబంధాలతో పోలిస్తే షుగర్ డాడీ-షుగర్ బేబీ రిలేషన్‌షిప్‌లో స్వేచ్ఛ మరియు స్వాతంత్ర్యం ఉంటాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య స్పష్టమైన హద్దులు మరియు ఒప్పందాలు ఉంటాయి. ఇందులో ఎమోషనల్ బాధ్యతలకు అవకాశం ఉండదు. ఇరువైపుల అవసరాలు మాత్రమే పరిగణలోనికి తీసుకుంటారు. తద్వారా పలు ఇతర ఇబ్బందుల నుంచి పూర్తి విముక్తి లభిస్తుందనే కారణంగా చాలా మంది దీనికి ఆకర్షితులవుతున్నారు. దీనికితోడు విలాసవంతమైన జీవనశైలి కోసం ఆరాటపడటమూ ప్రధాన కారణమని చెప్పవచ్చు.ఇక్కడ డబ్బు ఉంటే ఏదైనా సాధ్యమే అన్న దానికి ఒక సింపుల్ ఉదాహరణ ఈ షుగర్ డాడీ కల్చర్