spot_img
Tuesday, July 22, 2025
spot_img

మీరు ఏం చేస్తున్నారో మీ ఫోన్ ట్రాక్ చేస్తుంది..అందుకే ఈ ఒక్క సెట్టింగ్ ఆఫ్ చేయండి..!

స్మార్ట్‌ఫోన్ల వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అదే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి. ఫోన్లలోని కొన్ని ఫీచర్లు యూజర్లు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారో ట్రాక్ చేస్తుంటాయి అని తెలుసా సో ఎప్పుడూ ఏదైనా జరగొచ్చు దీంతో పర్సనల్ ప్రైవసీని కాపాడుకోవడం కొంచెం కష్టమే అవుతుంది. అయితే ఫోన్ మన కదలికలను గమనించకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని ఫోన్లలో కొన్ని రకాల ట్రాకర్స్ ఉంటాయి. ఈ ట్రాకింగ్‌ను ఆపడానికి కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి. ఈ సెట్టింగ్స్ ఎలా వాడాలో, పర్సనల్ డేటా ఇతరుల కంట పడకుండా ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం.

ఈరోజుల్లో వస్తున్న స్మార్ట్‌ఫోన్లలో “డిజిటల్ వెల్‌బీయింగ్” ఫీచర్‌ బిల్ట్ఇన్‌గా వస్తోంది. ఈ స్పెసిఫికేషన్‌తో యూజర్లు తాము మొబైల్‌ను ఎంతసేపు వాడుతున్నాం, ఏ యాప్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నాం, ఎంతసేపు స్క్రీన్‌ని చూస్తున్నాం వంటి వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ఇది మొబైల్ యూజర్ చేసే విషయాలన్నీ ట్రాక్ చేస్తుంది. దీన్ని యాక్సెస్ చేయడానికి, కింద ఇచ్చిన స్టెప్స్ ఫాలో కావాలి.

డిజిటల్ వెల్‌బీయింగ్ ఫీచర్

– ఫోన్‌లో సెట్టింగ్స్‌ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.

– ఆప్షన్స్‌లో “డిజిటల్ వెల్‌బీయింగ్ అండ్ పేరెంటల్ కంట్రోల్స్” అనే ఆప్షన్ సెలక్ట్ చేయాలి.

– ఫోన్‌ను ఎంతసేపు యూజ్ చేస్తున్నారు, ఏ యాప్స్‌ ఎక్కువగా వాడుతున్నారు వంటి వివరాలు అన్నీ ఇక్కడ చూడొచ్చు. ఉదాహరణకు, రోజుకు ఎన్ని సార్లు ఫోన్ అన్‌లాక్ చేస్తారు, ఎన్ని నోటిఫికేషన్స్ వస్తాయి, స్క్రీన్ టైమ్‌ ఎంత అనేవి తెలుసుకోవచ్చు.ఈ ఫీచర్ యూజర్ ఫోన్ యూసేజ్‌పై పూర్తి అవగాహన అందిస్తుంది. కానీ ఈ సమాచారం గూగుల్‌కి కూడా తెలుస్తుంది. డిజిటల్ వెల్ బీయింగ్ ఫీచర్ ఆఫ్ చేస్తే మొబైల్ యూజర్ యూసేజ్ ప్యాట్రన్‌ల గురించి తెలుసుకోలేదు. వారు ఏ యాప్స్ వాడుతున్నారు, ఎన్నిసార్లు అన్‌లాక్ చేస్తున్నారు, ఎంత టైమ్‌ మొబైల్‌తోనే గడుపుతున్నారు వంటి కలెక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా డిలీట్ అయిపోతుంది. దీని దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోతే ప్రైవసీకి భంగం వాటిల్లే అవకాశం ఉండదు. కానీ దీన్ని ఎలా ఆఫ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌లో తెలుసుకుందాం.

ట్రాకింగ్ ఫీచర్ ఆఫ్ చేసేదెలా?

స్టెప్ 1: మొబైల్ సెట్టింగ్స్‌లో “డిజిటల్ వెల్‌బీయింగ్” ఫీచర్‌ సెలక్ట్ చేయాలి. ఈ ఫీచర్‌ డాష్‌బోర్డ్‌లో టాప్ రైట్ కార్నర్‌లో ఉన్న త్రీ-డాట్స్ ఐకాన్‌పై క్లిక్ చేయాలి. డిజిటల్ వెల్ బీయింగ్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. అక్కడ “యూసేజ్ డేటా యాక్సెస్” లేదా “మేనేజ్ యువర్ డేటా” అనే ఆప్షన్ కనిపిస్తుంది. మొబైల్ మోడల్‌ని బట్టి ఈ ఆప్షన్ పేర్లు మారవచ్చు.

స్టెప్ 2: ఇక్కడ “డైలీ ఫోన్ యూసేజ్‌” అనే ఆప్షన్ ఉంటుంది. ఇది ఆన్ చేసి ఉంటే, ఫోన్ యూజర్ ఏం చేస్తున్నారో రోజూ గమనిస్తుంది.స్టెప్ 3: ఈ ఆప్షన్‌ను ఆఫ్ చేస్తే, ఫోన్ యూజర్ ఏం చేస్తున్నారనేది ట్రాక్ చేయడం ఆపేస్తుంది. అంటే, ప్రైవసీ ఇంప్రూవ్ అవుతుంది. కానీ ఇందులో భాగమైన “బెడ్‌టైమ్” లేదా “ఫోకస్ మోడ్” లాంటి కొన్ని ఫీచర్లు వర్క్ అవుతూనే ఉంటాయి. రాత్రి పడుకోవడానికి ముందు ఫోన్ వాడకుండా ఉండడానికి లేదా పని చేసేటప్పుడు ఫోన్‌ను దూరంగా ఉంచడానికి ఈ మోడ్స్ ఆన్ చేసుకోవచ్చు.టెక్నికల్ ఎక్స్ పర్ట్ లు తెలియజేసారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular