వాట్సాప్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక యూజర్లు కలిగిన యాప్‌లలో ఒకటిగా ఉంది. భారత్‌లో సుమారు 60 కోట్ల మంది యాక్టివ్ యూజర్‌లు ఉన్నారు. మెసేజ్‌లు సహా ఫోటోలు, వీడియో షేర్ చేసేందుకు ఈ ప్లాట్‌ఫాంను ఎక్కువగా వినియోగిస్తున్నారు.దీంతోపాటు కాల్స్, వీడియో కాల్స్ కూడా అనుకూలంగా ఉంటుంది. భారీ సంఖ్యలో ఉన్న యాజర్‌ల భద్రత, సౌకర్యం కోసం వాట్సాప్ ఫీచర్‌లను విడుదల చేస్తోంది. అయితే కొంత మంది వ్యక్తులు ఈ ప్లాట్‌ఫాంను దుర్వినియోగం చేస్తుంటారు. అనుమతిలేని కంటెంట్‌ను షేర్ చేస్తుంటారు.
అయితే ఈ తరహా ఘటనలకు పాల్పడితే వాట్సాప్ అకౌంట్ బ్యాన్ కావడం సహా కొన్ని ఘటనల్లో చట్టపరమైన శిక్ష విధించే అవకాశం ఉంటుంది. అయితే చాలా మంది అవగాహన లేకుండా కూడా కొన్నిరకాల కంటెంట్‌ను ఇతరులకు నేరుగా లేదా గ్రూప్‌లలో షేర్ చేస్తుంటారు. అయితే వాట్సాప్‌లో ఎవరికీ షేర్ చేయకూడని కంటెంట్ గురించి ఈ కథనంలో తెలుసుకోండి.
వాట్సా్ప్‌లో కొందరు వ్యక్తులు దేశానికి వ్యతిరేకంగా ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తుంటారు. అయితే ఈ తరహా కంటెంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. దేశానికి సంబంధించి ఎటువంటి వ్యతిరేక కంటెంట్‌ను వాట్సాప్‌లో ఇతరులకు షేర్ చేయకూడదు. ఈ తరహా కంటెంట్ కారణంగా అల్లర్లు సహా ఘర్షణలు జరిగే అవకాశం ఉంటుంది.దేశానికి వ్యతిరేకంగా వాట్సాప్‌లో ఎటువంటి వీడియోలు, ఫోటోలు, టెక్స్ట్ రూపంలో షేర్ చేస్తే వాట్సాప్ అకౌంట్‌ను బ్యాన్ చేసే అవకాశం ఉంటుంది. దీంతోపాటు కొన్నిసార్లు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. అందువల్ల మీకు వచ్చిన సమాచారాన్ని ధ్రువీకరించుకోకుండా.. ఇతరులకు షేర్ చేయకూడదు.
వాట్సాప్‌లో ముఖ్యంగా అడల్ట్ కంటెంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయకూడదు. ఫోటోలు లేదా వీడియోలను ప్రైవేట్ చాట్ లేదా గ్రూప్‌లలో షేర్ చేయకూడదు. ఈ తరహా కంటెంట్‌ను నిత్యం ఇతరులకు షేర్ చేస్తూంటే మీ వాట్సాప్ అకౌంట్ తాత్కాలికంగా బ్యాన్ అయ్యే అవకాశం ఉంటుంది. మరియు చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.
దీంతోపాటు చైల్డ్ పోర్నోగ్రఫీ లేదా చిన్నారుల దోపిడీలకు సంబంధించిన కంటెంట్‌ను షేర్ చేస్తే వాట్సా్ప్ ఖాతా నిషేదించబడుతుంది. మరియు కొన్నిసార్లు చట్టపరంగా శిక్ష విధించే అవకాశం ఉంటుంది. వ్యక్తిగతంగా లేదా గ్రూప్‌లలోనూ ఈ తరహా కంటెంట్ షేరింగ్‌కు దూరంగా ఉండడం ఉత్తమం.
వాట్సాప్‌లో ఇతరులను ఎగతాళి చేసినా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పరువునష్టం దావా కేసులు ఎదుర్కోవాల్సి రావచ్చు. అందువల్ల వాట్సాప్ వినియోగదారులు ఇతరులకు షేర్ చేస్తున్న కంటెంట్ పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలి. పైన తెలిపిన ఘటనల్లో సైబర్ చట్టాల కింద కేసులను ఎదుర్కోవాల్సి రావచ్చు.
వాట్సాప్ ఇటీవల నెలవారీ నివేదికను విడుదల చేసింది. ఇందులో కీలక వివరాలను వెల్లడించింది. సెప్టెంబర్ నెలలో ఏకంగా 85 లక్షల భారత అకౌంట్‌లపై నిషేధం విధించిందినట్లు తెలిపింది. ఐటీ రూల్స్ 2021, వాట్సాప్ దుర్వినియోగం మరియు ఇతర ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.
ఇందులో 16,58,000 అకౌంట్‌లపై ఎటువంటి ఫిర్యాదులు అందలేదని, నిబంధనలు అతిక్రమణ కారణంగా ఈ ఖాతాలను బ్యాన్ చేసినట్లు వివరించింది. ఆగస్టు 2024 లోనూ వాట్సాప్ సుమారు 84.58 లక్షల అకౌంట్‌లపై నిషేధం విధించింది. 16,61,000 అకౌంట్‌లపై ఫిర్యాదుల లేకున్నా బ్యాన్ చేసినట్లు వెల్లడించింది.