కుటుంబ సర్వే చేస్తున్నామంటూ ఫ్రాడ్ లింక్స్ పంపిస్తున్న సైబర్ నేరగాళ్లు.. ఆ లింక్ క్లిక్ చేస్తే వారి ఖాతాల్లో ఉన్న డబ్బులు మాయం.
అలానే కుటుంబ సర్వే ఓటీపీ వస్తుంది, చెప్పండి అంటూ ఫోన్ చేసి అడుగుతున్నారు.
కాబట్టి సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త
ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు కూడా తమకు అవకాశం గా చేసుకొని మోసం చేసేందుకు వెనుకాడటం లేదు సైబర్ క్రిమినల్స్. ఇప్పుడు ప్రభుత్వం కుటుంబ సర్వే చేస్తుందని ఆ కుటుంబ సర్వే మీద గుత్తిని లింకులు పంపి ఆ లింకులకు క్లిక్ చేస్తే దాని ద్వారా మీ మొబైల్ ను మీ బ్యాంక్ అకౌంట్ ను హ్యాక్ చేసి డబ్బులు దోచుకుంటున్న సంఘటన కూడా చోటు చేసుకుంటున్నాయి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన సమగ్ర కుటుంబ సర్వేపై సైబర్ నేరగాళ్ల కన్ను పడింది. ఆన్‌లైన్‌లో సర్వే, డిజిటల్‌గా కొన్ని పత్రాలు పంపాలంటూ నేరస్థులు మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారు. సర్వేలో భాగంగా కాల్ చేశామని, అడిగిన పత్రాలు ఇవ్వాలంటూ కాల్స్ వస్తున్నట్లు సైబర్‌క్రైమ్ పోలీసులు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా కుటుంబ వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.లింకులు,
ఏపీకే ఫైల్స్‌తో గాలం
సైబర్ నేరగాళ్లు ఏ ఒక్క అవకాశాన్ని వదలడం లేదు. ఇటీవల మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా నిర్వాసితులకు పరిహారం పేరుతో మోసగించేందుకు ప్రయత్నించారు. హైదరాబాద్‌లోని కొందరికి ఏపీకే ఫైళ్లు పంపించారు. నేరగాళ్లు ఇప్పుడు కుటుంబ సర్వేను అస్త్రంగా మార్చుకున్నారు. ఈ తరహా మోసాలపై ఇప్పటివరకూ కేసులు నమోదవ్వకున్నా సర్వే పేరుతో వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని పోలీసులు ప్రచారం చేస్తున్నారు. కుటుంబ సర్వేలో భాగంగా ప్రభుత్వ సిబ్బంది నేరుగా ఇళ్లకు వచ్చి మాత్రమే వివరాలు నమోదు చేసుకుంటారు. ఎలాంటి పత్రాలు తీసుకోరు. పని ఒత్తిడి, వ్యాపారంతో తీరిక లేకుండా ఉండడం, ఇతర ప్రాంతాల్లో పర్యటనల దృష్ట్యా సర్వే ఎప్పుడు పూర్తవుతుందోనని కొందరు ఎదురుచూస్తుంటారు. ఇలాంటి వారినే సైబర్ ముఠాలు లక్ష్యంగా చేసుకునే అవకాశముంది.సైబర్ క్రైమ్ పోలీసులు ఇలాంటి లింక్ లను గుర్తించారు తస్మాత్ జాగ్రత్త అని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు ఒకవేళ మీకు ఇలాంటి లింకులు ఉంచిన ఒకవేళ ఇలాంటి లింకులతో మోసపోయిన వెంటనే 1930 కానీ సైబర్ క్రైమ్ పోలీసులు గాని సమాచారం ఇవ్వాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు