ప్రతి రోజూ డైలీ మీ కంప్యూటర్, ల్యాప్టాప్, ఫోన్లో ఇంటర్నెట్ ఉపయోగిస్తూ బ్రౌజింగ్ ఉపయోగిస్తున్నారా? అయితే ఇంటర్నెట్ యూజర్స్ కోసం బ్రిటీష్ సైబర్ సెక్యూరిటీ సంస్థ సొఫోస్ ఓ హెచ్చరికను జారీ చేసింది.ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరింది..గూగుల్ సెర్చ్ చేస్తున్నప్పుడు..గూగుల్లో ‘ఈ ఆరు పదాలను’ కలిపి టైప్ చేసి సెర్చ్ చేస్తే మీ డివైస్లోని పర్సనల్ డేటా హ్యాకర్ల చేతికి చిక్కడం ఖాయమని హెచ్చరించింది. తప్పనిసరిగా అంతర్జాలాన్ని రెగ్యూలర్గా ఉపయోగించే యూజర్స్ కోసం అర్జెంట్ అలర్ట్ను జారీ చేసింది. ఇంతకీ ఆ ఆరు పదాలు ఏంటి? గూగుల్లో ఏ పదాలను కలిపి టైప్ చేస్తే మన డివైస్ హ్యాక్ అవుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంతకీ ఆ పదాలు ఏంటంటే? – ఈ మధ్య కాలంలో హ్యాకర్లు పెట్రేగి పోతున్న సంగతి తెలిసిందే. దీంతో హ్యాకర్ల బెడద బాగా ఎక్కువైపోయింది. ఇంటర్నెట్ యూజ్ చేసే సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతిఒక్కరినీ హడలెత్తిస్తున్నారు. వారి పర్సనల్ డేటాతో పాటు డబ్బును దొంగిలిస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఓ హెచ్చరిక జారీ చేసింది సొఫోస్. ముఖ్యంగా మీ కంప్యూటర్లో ‘Are Bengal Cats legal in Australia?’ అని టైప్ చేసి సెర్చ్ చేయడం ద్వారా హ్యాక్కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, మీ పర్సనల్ డేటాను హ్యాకర్లు దొంగిలిస్తారని హెచ్చరించింది.
‘Are Bengal Cats legal in Australia?’ –సేమ్ ఇదే విధంగా (కొంచెం కూడా మార్పు లేకుండా) అంటే ఉన్నది ఉన్నట్టుగా గూగుల్లో టైప్ చేయడం లేదా సెర్చ్ చేయడం ద్వారా వ్యక్తిగత సమాచారం దొంగిలించే అవకాశం ఉందని తెలిపింది సొఫోస్. ఈ వర్డ్స్ను కలిపి టైప్ చేయడం టాప్ రిజల్ట్స్లో ఫేక్ లింక్స్ వస్తాయని, వాటిని క్లిక్ చేయడం ద్వారా డేంజరస్ మాలిసియన్ యాడ్స్, వెబ్సైట్స్లోకి రీడైరెక్ట్ అవుతుందని చెప్పింది. కాబట్టి యూజర్స్ జాగ్రత్త వహించాలని పేర్కొంది.
క్లిక్ చేస్తే ఏం జరుగుతుందంటే? – ఒకవేళ యూజర్స్ ఈ డేంజరస్ లింక్స్పై క్లిక్ చేయడం ద్వారా కంప్యూటర్స్లో హిడెన్ మాల్వేర్ ప్రవేశిస్తుంది. ఇది ఎంట్రీ ఇచ్చాక సెకన్లలోనే గూట్కిట్ అనే మరింత ప్రమాదకరమైన ప్రోగ్రామ్ ప్రవేశించేలా చేస్తుంది. ఈ గూట్కిట్ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడంలో దిట్ట. అలాగే ఇది యూజర్స్ నెట్వర్క్లోకి చొరబడిన తర్వాత ట్రోజాన్(ఆర్ఏటీ) అనే మాల్వేర్ను సుధీర్ఘ కాలం సిస్టమ్లో తిష్ట వేసేలా చేయడంతో పాటు అటాక్ చేసి కంప్యూటర్ను పూర్తి కంట్రోల్లోకి తీసుకుంటుంది. ఈ గూట్కిట్ ర్యాన్సమ్వేర్ లేదా కోబాట్ స్ట్రైక్ వంటి ఇతర హానికరమైన మాల్వేర్ను పంపించి కూడా సిస్టమ్పై అటాక్ చేసి సమాచారాన్ని దొంగిలిస్తుంది.ముఖ్యంగా ‘Are Bengal Cats legal in Australia?’ను టైప్ చేసినప్పుడు ఇందులో ఆస్ట్రేలియా అనే పదం చాలా డేంజర్ అని పేర్కొంది సొఫోస్. ఎప్పుడైతే యూజర్ తెలీకుండా దాన్ని టైప్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్పై క్లిక్ చేస్తాడో ఆటోమేటిక్గా హ్యాకర్ చేతికి సున్నితమైన సమాచారం వెళ్లిపోతుందట. గూట్లోడర్ అనే ప్రోగ్రామ్ ద్వారా బ్యాంక్ అకౌంట్ లాంటి సున్నితమైన డేటా ఇన్ఫర్మేషన్ దొంగిలించబడుతుందట. ఇది కేవలం సమాచారాన్ని దొంగిలించడమే కాకుండా యూజర్స్ తమ కంప్యూటర్ను యాక్సెస్ చేయలేకుండా చేస్తుందని తెలిపింది సొఫోస్.
Australia, Hacking, Cyber Crime, Google Beware, Don’t type these six words in Google, Hackers. google hackers, hackers threat, google search, don’t type these words in google, google search, safe search, google aleret
కాబట్టి ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ఆరు పదాలను కలిపి టైప్ చేయకుండా ఉండాలని హెచ్చరిస్తోంది సొఫొస్. హ్యాకింగ్లో ఇదో కొత్త సైబర్ ట్యాక్టిక్ అని పేర్కొంది. అలానే సెర్చ్ ఇంజిన్లో టాప్ రిజల్ట్స్, సెర్చస్లో ఎక్కువగా హానికరమై సైట్స్, లింక్స్ వచ్చేలా హ్యాకర్లు మానిపులేట్ చేస్తున్నారని, దీన్ని ఎస్ఈఓ పాయిజనింగ్ అంటారని తెలిపింది. యూజర్స్ జాగ్రత్త వహించాలని తెలిపారు