BBC తెలుగు సమాచారం మేరకు
ఈ మధ్య కొత్తగా సోషల్ మీడియా పేజీల్లో ‘బ్లూస్కై’ (Bluesky) అనే పదం కనిపించి ఉండొచ్చు.. ఇవిగో ఇవే వివరాలు.
ఎలాన్ మస్క్‌కి చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ఎక్స్'(గతంలో ట్విటర్)కి ప్రత్యామ్నాయం అని చెప్పుకోవచ్చు
దీని లోగో, లోగో కలర్ అన్నీ ఎక్స్‌కు దగ్గరగానే ఉంటాయి.
బ్లూస్కై వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం రోజుకు 10 లక్షల మందికిపైగా ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో చేరుతున్నారు.ఇప్పటికే బ్లూస్కై వినియోగదారుల సంఖ్య 1.67 కోట్లకు చేరింది ఎన్నో షోషమీడియా ఉన్నా బ్లూస్కై? ఎందుకు ఇంతమంది చేరుతున్నారు
బ్లూస్కై అంటే ఏంటి?
”సోషల్ మీడియా అంటే ఇలా ఉండాలి” అని బ్లూస్కై తనను తాను అభివర్ణించుకున్నప్పటికీ, ఇది ఇతర ప్లాట్‌ఫాంల మాదిరిగానే కనిపిస్తుంది.
ఈ సైట్ చూసినప్పుడు, పేజీకి ఎడమవైపు ఉన్న బార్‌లో సెర్చ్, నోటిఫికేషన్స్, హోం పేజీ వంటి మొదలైన ఆప్షన్లు కనిపిస్తాయి.
ఈ సోషల్ మీడియా ఖాతాను వినియోగించే వారు తమకు ఇష్టమైన పోస్టులు చేయొచ్చు, కామెంట్లు చేయొచ్చు, రీపోస్టు చేయొచ్చు, లేదంటే ఇతరులు పోస్టు చేసిన వాటిని లైక్ చేయొచ్చు.మామూలుగా చెప్పాలంటే, గతంలో ట్విటర్ ఎలా ఉండేదో అలాగే ఇది కూడా పనిచేస్తుంది.వాటితో బ్లూస్కైకి ఉన్న ప్రధాన తేడా ఏంటంటే డీసెంట్రలైజ్డ్. వినియోగదారులు తమ డేటాను కంపెనీకి చెందిన సర్వర్లలోనే కాకుండా, ఇతర సర్వర్లలోనూ భద్రపరుచుకునే అవకాశం ఉండడం, బ్లూస్కై వినియోగదారులు కేవలం తమ బ్లూస్కై అకౌంట్‌తో మాత్రమే కాకుండా, తమ సొంత అకౌంట్ ద్వారా కూడా లాగిన్ అవ్వొచ్చు.చాలామంది వ్యక్తులు తమ సొంత అకౌంట్‌తో లాగిన్ చేసేందుకు ఇష్టపడరు. కొత్తగా బ్లూస్కైలో చేరిన వారి యూజర్ నేమ్ చివరన ”.bsky.social” అని రావడం కూడా మిగతావాటి కంటే భిన్నంగా ఉంది. Blueskyబ్లూస్కై పేజీ కూడా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల మాదిరిగానే కనిపిస్తుంది
ఈ బ్లూస్కై?అచ్చం ‘ఎక్స్’లానే ఉందని అనిపించినా, అలా ఎందుకో తెలిస్తే పెద్దగా ఆశ్చర్యం కలగదు.ట్విటర్ మాజీ హెడ్ జాక్ డోర్సీ దీన్ని రూపొందించారు.దీనిని ట్విటర్‌కు డీసెంట్రలైజ్‌డ్ వెర్షన్‌గా తీసుకురావాలని, ఏ ఒక్క వ్యక్తి లేదా సంస్థ సొంతం చేసుకోలేని విధంగా ఇది ఉండాలని కోరుకుంటున్నట్లు గతంలో డోర్సీ చెప్పారు.2024 మేలో డోర్సీ బ్లూస్కై బోర్డు నుంచి వైదొలిగారు, ఆ జట్టులోనూ ఇప్పుడాయన లేరు. సెప్టెంబర్‌లో తన అకౌంట్‌ను రద్దు కూడా చేశారు.ఇప్పుడు ఈ సంస్థ అమెరికా పబ్లిక్ బెనిఫిట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ జే గ్రాబెర్ సారథ్యంలో నడుస్తోంది అని సమాచారం