spot_img
Monday, July 21, 2025
spot_img

ట్యాక్సీ డ్రైవర్‌గా నటించి.. సీరియల్‌ కిల్లర్‌ని పట్టించాడు!

దొంగలను పట్టుకోవడానికి హీరో దొంగగా మారి వారి ఆట కట్టించడం మనం సినిమాల్లో చూశాం. ఇదే తరహాలో సీరియల్‌ కిల్లర్‌ని పోలీసులకు పట్టించాడో ఓ వ్యక్తి. ఇది సినిమా కథ కాదు రియల్ గా జరిగిన స్టోరి..వివరాల్లోకి వెళితే

2021 ఆగస్టులో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ సమీపంలోని కమోద్‌ గ్రామంలో వివేక్‌ గోహిల్‌ అనే యువకుడు బైక్‌ ప్రమాదంలో చనిపోయాడు. అతడు యాక్సిడెంట్‌లోనే చనిపోయాడని పోలీసులతో అందరూ అనుకున్నారు. కానీ అతడి సోదరుడు జిగానీ గోహిల్‌(24) మాత్రం నమ్మలేదు. తన సోదరుడిది ముమ్మూటికీ హత్యేనని అనుమానించాడు. అసలేం జరిగిందో తెలుసుకోవడానికి స్వయంగా రంగంలోకి దిగాడు. వివేక్‌పై విషప్రయోగం చేశారని అతడు తెలుసుకున్నాడు. తన సోదరుడు చనిపోవడానికి ముందు నవల్‌సిన్హ్ చావ్డా అనే మంత్రగాడితో టచ్‌లో ఉన్నట్టు గుర్తించాడు.

తన సోదరుడిని హత్య చేసిన దుండగుడిని పట్టుకునేందుకు జిగానీ గోహిల్‌ నైట్‌ షిప్ట్‌ ట్యాక్సీ డ్రైవర్‌గా మారాడు. యూట్యూర్ కూడా అయిన నవల్‌సిన్హ్‌కు కారు ఉంది. ఉదయం అతడు కారు నడిపేవాడు. రాత్రిపూట జిగానీ కారు నడుపుతూ నవల్‌సిన్హ్‌కు దగ్గరయి, అతడి విశ్వాసం సంపాందించాడు. అతడికి సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకున్నాడు. అభిజీత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ అనే మరో వ్యక్తిని హత్య చేయడానికి నవల్‌సిన్హ్‌ ప్లాన్‌ చేశాడు. తనకు సహకరిస్తే వచ్చే డబ్బులో 25 శాతం వాటా ఇస్తానని ఆశచూపించాడు. జిగానీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం అందించడంతో నవల్‌సిన్హ్‌ కటకటాల పాలయ్యాడు.

ప్రత్యేక పూజలు చేసి ధనవంతుడిని చేస్తానని సనంద్‌ ప్రాంతానికి చెందిన అభిజీత్‌ సింగ్‌ (29)ను నవల్‌సిన్హ్‌ నమ్మించాడు. నీళ్లలో విషపదార్థం కలిపి అతడిని అంతం చేసి.. డబ్బు లాగాలని పథకం వేశాడు. జిగానీ ఇచ్చిన సమాచారంలో రంగంలోకి దిగిన సక్రెజ్‌ ప్రాంత పోలీసులు మమత్‌పురాలో నవల్‌సిన్హ్‌ను అరెస్ట్‌ చేశారు. 2023లోనూ ముగ్గురిని ఇలాగే అతడు చంపినట్టు పోలీసులు అనుమానిస్తునారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిపై విషప్రయోగం చేసి చంపేసి, వారి మృతదేహాలను దుద్రేజ్‌ కాలువలో పడేశారు. వారు ముగ్గురూ ఆత్మహత్య చేసుకున్నారని అందరినీ నమ్మించడంతో నవల్‌సిన్హ్‌ తప్పించుకున్నాడు. ఇప్పుడు ఆధారాలతో సహా దొరికిపోవడంతో పాత కేసులను కూడా పోలీసులు తిరగదోడుతున్నారు.

నరబలి ఆరోపణలు
నవల్‌సిన్హ్‌ను చట్టానికి పట్టించడంలో జిగానీ పెద్ద సాహసమే చేశాడు. ట్యాక్సి డ్రైవర్‌గా అతడికి దగ్గరయి ఆధారాలు సంపాదించాడు. సరైన సమయంలో హంతకుడిని పోలీసులకు పట్టించాడు. నవల్‌సిన్హ్‌ కారు నుంచి పూజాసామాగ్రి, విషపదార్థంగా అనుమానిస్తున్న వైట్‌ పౌడర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాంత్రిక పూజలతో అమాయకులను నమ్మించి హత్య చేసిన అతడిపై సెక్షన్‌ 55, 318(1), (2) కింద కేసు నమోదు చేశారు. అయితే నరబలి ఇచ్చాడా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుజరాత్‌ నరబలి వ్యతిరేక చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular