చిత్ర పరిశ్రమలోని కొన్ని ప్రముఖ కుటుంబాల ప్రస్తావన వస్తే మొదటిగా మెగా కుటుంబం.. తర్వాత నందమూరి, అక్కినేని ఇంకా దగ్గుబాటి కుటుంబాల పేర్లు టాప్ లో వస్తాయి.వీరితో పాటుగా తెలుగులో మరిన్ని కుటుంబాలు కూడా ఉన్నాయి. ఘట్టమనేని కుటుంబం , మంచు కుటుంబాలు కూడా టాలీవుడ్‌పై తమ ముద్ర వేశాయి.
అయితే ఈ అందరిలో డిఫరెంట్ ఫ్యామిలీ ఏదన్నా ఉంది అంటే ఇపుడు చాలా మంది ఖచ్చితంగా మంచు వారి కుటుంబమే అని చెబుతారు. మంచు కుటుంబంపై ఇప్పుడు చాలా ట్రోల్స్ అవీ ఉంటాయి కానీ కొన్ని సందర్భాల్లో.. వీరి రేంజ్ చూసి చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రీసెంట్‌గా సూపర్ స్టార్ రజినీకాంత్.. మోహన్ బాబుకి ఎంత దగ్గర స్నేహితుడు అనేది కూడా చాలా మందికి తెలుసు. ఇది కాకుండా లేటెస్ట్‌గా కొన్ని షాకింగ్ వార్తలు బయటకి వచ్చాయి.మంచు మోహన్ బాబు అలాగే తన చిన్న కొడుకు మంచు మనోజ్ నడుమ చాలా గొడవలు జరుగుతున్నాయని పరస్పరం ఇద్దరూ ఒకరిని ఒకరు కొట్టుకున్నారని పోలీస్ స్టేషన్‌లో ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకున్నారని వార్తలు వచ్చాయి. ఈ ఊహించని ఘటనతో ఒక్కసారిగా అందరికీ షాక్ తగిలినట్లయ్యింది. ఇదిలా ఉండగా మంచు ఫ్యామిలీ గొడవల్లో పలు ఆసక్తికర అంశాలు ఇపుడు వినిపిస్తున్నాయి.
మెయిన్ గా ప్రస్తుతం గొడవ మంచు మనోజ్ అండ్ మంచు మోహన్ బాబు నడుమే జరుగుతుండగా ఇందులో విష్ణు ఇన్వాల్వ్మెంట్ లేదని తెలుస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల నడుమ ఇపుడు ఆస్తి తగాదాలు నడుస్తుండగా మంచు లక్ష్మి మాత్రం ఈ గొడవల నుంచి నైస్ గా పక్కకి తప్పుకున్నట్టుగా ఫిలిం సర్కిల్స్‌లో రూమర్స్ వినిపిస్తున్నాయి.
ఇటీవల కాలంలో మంచు లక్ష్మి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు . అయితే ఇపుడు ఈమె ముంబైకి మకాం మార్చేసింది అని పలు గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఆస్తిలో రావాల్సింది తీసుకొని తను ముంబైలో సెటిల్ అయ్యిపోయింది అని అంటున్నారు. కానీ ఇపుడు కుటుంబంలో గొడవలు జరుగుతున్న తరుణంలో తాను మాత్రం హ్యాపీగా నార్త్‌లో లైఫ్ సాగిస్తుంది అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.అసలు మంచు వారి కుటుంబంలో అసలేం జరుగుతుంది అనే ప్రశ్నలు మరింత ఎక్కువ అవుతున్నాయి. మరోపక్క మంచు విష్ణు విదేశాల్లో ఉన్నాడని తాను కొద్దిరోజుల్లోనే తిరిగి వస్తాడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అపుడు మళ్ళీ కుటుంబంలో రచ్చ జరగబోతోందని పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుంది అనేది ప్రస్తుతానికి వారికే తెలియాలి.