హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు చేసింది చాలు.. ఇక ఆపండంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.ఖాజాగూడా చెరువులో హైడ్రా కూల్చివేతలపై అంశంపై హైకోర్టులో మంగళవారం నాడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా వాదనలు విన్న న్యాయమూర్తి.. హైడ్రా తీరుపై కన్నెర్ర జేశారు. కూల్చివేతలు చేపట్టిన ల్యాండ్ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నట్లు ఎలా చెబుతున్నారని ప్రశ్నించింది న్యాయస్థానం. ఆధారాలు ఉన్నాయా? అని హైడ్రాను నిలదీసింది. పిటిషనర్ వద్ద అన్ని డాక్యూమెంట్స్ ఉన్నాయి కదా? అని హైడ్రాను ప్రశ్నించింది కోర్టు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధి తేల్చకుండా కూల్చివేతలు ఎలా చేపడతారని నిలదీసింది.
కమిషనర్‌కు చెప్పి కూల్చివేతలు ఆపివేయాలని ఆదేశించారు న్యాయమూర్తి. లేదంటే తాము ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేస్తామని తీవ్ర స్వరంతో హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటివి పునరావృతం అయితే కమిషనర్ రంగనాథ్‌పై సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు న్యాయమూర్తి. ఇదే సమయంలో పిటిషనర్‌కు కూడా కీలక ఆదేశాలిచ్చింది హైకోర్టు ధర్మాసనం. పిటిషనర్ కూడా జీహెచ్ఎంసీ పర్మిషన్ లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేయకూడదన్నారు. పిటిషనర్ వేసిన తాత్కాలిక ఫెన్సింగ్ కూడా 24 గంటల్లో పిటిషనరే తొలగించాలని హైకోర్టు ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.