చైనా నుంచి ప్రపంచదేశాలకు పాకిన కరోనా వైరస్ ఎంత బీభత్సం సృష్టించో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ వైరస్ దెబ్బకు కోట్ల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయారు.మనదేశంలో కూడా పెద్ద సంఖ్యలోనే కరోనా మరణాలు నమోదయ్యాయి. మూడేళ్ల క్రితం కరోనా వైరస్ పేరు వినబడితేనే హడలిపోయేవాళ్లు అంతా. కరోనా వైరస్ కి పుట్టినిళ్లుగా చైనాని భావిస్తారు. చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచి ఈ భయంకరమైన వైరస్ బయటికొచ్చినట్లు అనేక ఆరోపణలున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కూడా గతంలో అనేకసార్లు ఈ విషయాన్నే చెప్పారు. చైనా ల్యాబ్ నుంచే కరోనా వైరస్ బయటికొచ్చినట్లు ఆయన వ్యాఖ్యలు చేశారు.
మళ్లీ ఇప్పుడు ఇలా
ఇప్పుడు మరోసారి చైనా వైరస్ ల బారిన చిక్కుకొని విలవిలలాడుతోంది. పలు రకాల వైరస్ ల వ్యాప్తితో డ్రాగన్ దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు హాస్పిటల్స్ లో చేరుతున్నారు. వైరస్ ల బారిన పడిన పేషెంట్లతో హాస్పిటల్స్ కిక్కిరిసిపోతున్నాయి. మరణాలు కూడా ఎక్కువగానే నమోదవుతున్నట్లు తెలుస్తోంది.మళ్లీ ఇప్పుడు ఇలా
ఇప్పుడు మరోసారి చైనా వైరస్ ల బారిన చిక్కుకొని విలవిలలాడుతోంది. పలు రకాల వైరస్ ల వ్యాప్తితో డ్రాగన్ దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు హాస్పిటల్స్ లో చేరుతున్నారు. వైరస్ ల బారిన పడిన పేషెంట్లతో హాస్పిటల్స్ కిక్కిరిసిపోతున్నాయి. మరణాలు కూడా ఎక్కువగానే నమోదవుతున్నట్లు తెలుస్తోంది.
హెల్త్ ఎమర్జెన్సీ
కరోనా తర్వాత ఇప్పుడు మరోసారి చైనా దేశంలో వైరస్ కారక మరణాలు పెద్ద సంఖ్యలో సాగుతున్నాయని తెలుస్తోంది. కోవిడ్ 19తో పాటు మైక్రోప్లాస్మా న్యూమోనియా,ఇన్ ఫ్లూయెంజా-A,HMPV వంటి వైరస్ లో చైనాలో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నాయి. చైనాలో పలు వైరస్ ల మూకుమ్మడి వ్యాప్తి నేపథ్యంలో జిన్ పింగ్ ప్రభుత్వం చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ పెట్టినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక సమాచారం లేనప్పటికీ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి వైరస్ ల వ్యాప్తిని అరికట్టేందుకు యుద్ధప్రాతిపదికన చైనా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు సమాచారం.
HMPV వైరస్ కేసుల పెరుగుదల
చైనాలో హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) ఇన్‌ఫెక్షన్లు పెరుగుతున్నాయి. ఓ నివేదిక ప్రకారం ఈ వైరస్ 2001లో కనుగొనబడింది. ఇది శ్వాసకోశ సమస్యలను కలిగించే వైరస్. శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధులు గణనీయంగా పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఇన్ఫెక్షన్ కేసులు ప్రస్తుతం చైనాలో ఎక్కవగా ఉన్నట్లు తెలుస్తోంది.