spot_img
Monday, July 21, 2025
spot_img

కీచక ఐపీఎస్‌: మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు

ట్రాఫిక్‌ విభాగంలో ఐపీఎస్‌ అధికారి కీచకుడయ్యాడు. మహిళా పోలీసును లైంగికంగా వేధించడంతో ఆమె డీజీపీ శంకర్‌ జివ్వాల్‌కు ఫిర్యాదు చేశారు.దీంతో ఐపీఎస్‌ను సస్పెండ్‌ చేశారు. విశాఖ కమిటీ విచారణకు ఆదేశించారు. గతంలో మహిళా ఐపీఎస్‌కు డీజీపీ స్థాయి అధికారి ఒకరు వేధింపులు ఇవ్వడం, ఐజీ స్థాయి అధికారి తన సహచర అధికారిణికి వేధింపులు ఇవ్వడం వంటి ఘటనలు తమిళనాట పోలీసు యంత్రాంగంలో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.

తరచూ ఏదో ఒక చోట కింది స్థాయి అధికారులపై వేధింపుల పిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితులలో గురువారం ట్రాఫిక్‌ విభాగంలో పనిచేస్తున్న మహిళా పోలీసులు ఒకరు డీజీపీ శంకర్‌ జివ్వాల్‌ను నేరుగా కలిసి ఫిర్యాదు చేశారు. తాను ఎదుర్కొంటున్న వేదింపు గురించి ఆయనకు వివరించారు. చెన్నై కమిషరేట్‌లో ఏడవ అంతస్తులో›ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషననర్‌గా ఉన్న ఐపీఎస్‌ అధికారి డి. మహేశ్‌కుమార్‌ ఈ వేదింపులకు గురి చేసినట్టు ఫిర్యాదు చేయడం తక్షణం, విచారణ జరగడం జరిగింది.విచారణలో ఆయనపై ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు లభించడంతో తక్షణం సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే ఈ కేసును డీజీపీ సీమా అగర్వాల్, ఐపీఎస్‌ అధికారిణులతో కూడిన విశాఖ కమిటికి అప్పగించారు. ఈ కమిటీ తన విచారణపై దృష్టి పెట్టింది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా మహేశ్‌కుమార్‌పై తదుపరి చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular