మంచు లక్ష్మికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిర్మాతగా, నటిగా, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉంటరామె.సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేస్తుంటారు. ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో మంచు లక్ష్మి తర్వాతే ఎవరైనా. దీనిపై ఆమె చాలానే విమర్శలు ఎదుర్కొన్నారు.
అయినప్పటికి తన పంథాను ఏమాత్రం మార్చుకోకుండా ముందుకు సాగుతున్నారు.ఇక మంచు లక్ష్మి పెళ్లిపై కూడా అనేక ఊహాజనిత కథనాలు ప్రసారంలో ఉన్నాయి.ఆమె చదువుకుంటున్న సమయంలోనే తన కాలేజీ స్నేహితుడుని ప్రేమించి పెళ్లి చేసుకుందని..ఇంటి నుండి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయి మరీ అతన్నిపెళ్ళాడిందనే వార్త అప్పట్లో బాగానే వైరల్ అయింది. అయితే పెళ్లైన కొద్ది రోజులకే ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తికి ఆమె విడాకులు ఇచ్చిందని..ఈ విడాకులు వెనుక తండ్రి మోహన్ బాబు హస్తం ఉంది అనేది ఆరోపణలు వినిపించాయి. మొదటి భర్తకు విడాకులిచ్చిన తర్వాత ఆండ్రు శ్రీనివాస్‌తో మంచు లక్ష్మి పెళ్లి జరిపించారట మోహన్ బాబు.వీరికి ఓ పాప కూడా ఉంది.భర్త ఆండ్రు శ్రీనివాస్‌తో మంచు లక్ష్మి పెద్దగా ఎప్పుడు బయట కనిపించలేదు.దీంతో మంచు లక్ష్మి భర్తకు దూరంగా ఉంటుందని, వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై మంచు లక్ష్మి రియాక్ట్ అయ్యారు.నా భర్త ఫారెన్‌లో ఐటీ ప్రొఫెషనల్‌గా వర్క్ చేస్తున్నారు. మేము మా వైవాహిక జీవితంలో ఎంతో అన్యోన్యంగానే ఉంటామని మంచు లక్ష్మి తెలిపారు. మా ఇద్దరికి బాధ్యతలు ఉన్నాయని, ప్రస్తుతం నేను నా భర్తతో కలిసి ఉన్నానని, మాకు ఎలా అనిపిస్తే అలా బతుకుతున్నాము.. జనాలు ఏమనుకుంటారో అని ఆలోచించలేమని ఆమె తెలిపారు.తన కూతురు ఇప్పుడు భర్త దగ్గర ఉందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మంచు లక్ష్మి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.