మావోయిస్టు పార్టీ శాంతి చర్చలను కోరుకుంటోంది. కొన్ని షరతులను విధిస్తూ అందుకు కేంద్ర, వివిధ రాష్ట్రల ప్రభుత్వాలు అంగీకరిస్తే తాము తక్షణ కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నట్లు ఆ పార్టీ కేంద్ర కమిటీ ప్రకటించింది. ఈమేరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదలైంది. వచ్చే సంవత్సరం మార్చి నెలాఖరుకల్లా నక్సల్ రహిత దేశంగా మారుస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పదే పునరుద్ఘాటిస్తున్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీ శాంతి చర్చల ప్రతిపాదనను తెరపైకి తీసుకురావడం విప్లవ కార్యకలాపాల పరిశీలకుల్లో చర్చకు దారి తీసింది.‘‘మధ్య భారతంలో జరుగుతున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలని, మావోయిస్టు పార్టీ బేషరతుగా కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలు జరపాలి’ అనే అంశంపై గత నెల 24న హైదరాబాద్ లో శాంతి చర్చల కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినట్లు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేర్కొన్నారు. ప్రస్తుత స్థితిలో శాంతి చర్చల కమిటీ ఏర్పాటును, ఆయా సమావేశాన్ని తాము స్వాగతిస్తున్నట్లు చెప్పారు.
గన్ డౌన్’కు మావోయిస్టులు సిద్ధం
RELATED ARTICLES