సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) సరికొత్త ప్లాన్లతో అమాయక ప్రజలను టార్గెట్ చేస్తున్నారు. తక్కువ కష్టానికి ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆశపడే వారిని బురిడీ కొట్టించేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు.కొంత కాలం క్రితం వరకు లాటరీలు, గిఫ్ట్ కార్డులు, డ్రగ్స్ పార్శిల్స్ పేరుతో మోసాలు చేసేవారు. కానీ ఇప్పుడు నకిలీ వెబ్‌సైట్లను ఉపయోగించి కోట్లు కొల్లగొడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారిని ‘కియా మోటార్స్’ డీలర్‌షిప్ ఇప్పిస్తామని నమ్మించి రూ.1.28 కోట్లు మోసం చేసిన ఘటన వెలుగుచూసింది.పోలీసులు తెలిపిన దాని ప్రకారం.. మాదాపూర్‌కు చెందిన ఓ వ్యాపారి కియా కార్ల డీలర్‌షిప్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేయగా, నకిలీ వెబ్‌సైట్ కనిపించింది. అసలు విషయం తెలియక అక్కడ తన వివరాలు నమోదు చేయగా, కొంతకాలానికి చిరాగ్ శుక్లా అనే వ్యక్తి ఫోన్ చేసి ఆధార్, పాన్ కార్డ్, భూమి పత్రాలు, అద్దె ఒప్పందం తదితర వివరాలు తీసుకున్నాడు. అనంతరం రిజిస్ట్రేషన్ ఫీజు, లైసెన్స్, సెక్యూరిటీ డిపాజిట్, బీమా, స్టాక్ బుకింగ్ పేరుతో వేర్వేరు విడతల్లో మొత్తం రూ.1.28 కోట్లు వసూలు చేశాడు. వ్యాపారి మళ్లీ రూ.25 లక్షలు అడిగిన తర్వాత అనుమానం వచ్చి వెబ్‌సైట్ పరిశీలించగా, అది నకిలీదని గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ ఘటన ప్రజలందరికీ పెద్ద హెచ్చరికగా మారింది. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. ఏదైనా డీలింగ్ చేసుకునే ముందు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలి. గూగుల్‌లో కనిపించే అనుమానాస్పద లింకులను నమ్మి తమ వ్యక్తిగత సమాచారం అందించరాదు. ఇంకా అనుమానాస్పద ఫోన్ కాల్స్, మెసేజ్‌లను లిఫ్ట్ చేయకుండా, ఎటువంటి లింక్‌లు, ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలి.
రూటు మార్చిన సైబర్ నేరగాళ్లు..ఏంచేస్తున్నారో తెలుసా ?
RELATED ARTICLES