సినీ తారలంటే అందరికీ ఎంతో అభిమానం. కొందరు సినీ తారల కోసం ఏదైనా చేస్తారు. అయితే దొంగలకు కూడా సినీతారలంటే ఇష్టం ఉంటుంది.ఓ గజ దొంగ మాత్రం తాను అభిమానించే హీరోయిన్‌పై ఎంతో ప్రేమ చూపించేవాడు. ఆమెపై అభిమానమే కాదు.. ఆమెను కలుస్తూ.. ఆమెకు ఎన్నో కానుకలు ఇస్తూ వస్తుండేవాడు. అదే అభిమానంతో ఆ హీరోయిన్‌కు దొంగ ఏకంగా విలాసవంతమైన ఇంటిని కట్టి ఇచ్చాడు. ఆ ఇంటి విలువ రూ.3 కోట్లకు పైగా ఉండడం విశేషం. ఆ దొంగ ఎవరు? ఆ హీరోయిన్ ఎవరు? అనేది వివరాలు తెలుసుకుందాం.కర్ణాటకలోని బెంగుళూరు పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన పంచాక్షరి స్వామి అనే వ్యక్తి మొదట నుంచి కూడా నేరాలు, దొంగతనాలకు పాల్పడుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. దొంగతనం అతడి వృత్తి. చిన్నతనం నుంచే దొంగతనాలు వ్యాపకంగా చేసుకున్న అతడికి వివాహమై ఒక పాప కూడా ఉంది. మొదట్లో చిన్న చిన్న దొంగతనాలు చేసే పంచాక్షరి స్వామి అనంతరం పెద్ద దొంగతనాలకు కూడా అలవాటు పడ్డాడు.
2014-15 ఏడాదిలో పంచాక్షరి స్వామికి ఒక ప్రముఖ సినీ హీరోయిన్‌తో పరిచయం ఏర్పడింది. ఆమెతో ప్రేమ సంబంధం ఏర్పరుచుకున్నాడు. అప్పుడప్పుడు ఆమెకు ఖరీదైన గిఫ్టులు ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే వాటి కోసం భారీ దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. దొంగతనాలతో వచ్చిన డబ్బుతో ఆ హీరోయిన్‌కు బహుమతులు ఇస్తూ పంచాక్షరి స్వామి ఎంజాయ్ చేసేవాడు. ఇదే క్రమంలో హీరోయిన్ కోసం ఏకంగా కోల్‌కతాలో రూ.3 కోట్ల విలువైన ఇంటిని కూడా కట్టించి ఇచ్చాడు. ఆ హీరోయిన్‌కు రూ.22 లక్షల విలువైన అక్వేరియాన్ని బహుమతిగా ఇచ్చాడు.
అయితే బెంగళూరులో వరుసగా సంపన్నులు, కోటీశ్వరుల ఇళ్లలో దొంగతనాలు జరుగుతుండడంతో పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టారు. జనవరి 9వ తేదీన ఓ దొంగతనం కేసులో పంచాక్షరి స్వామి పోలీసులకు చిక్కాడు. దర్యాప్తు చేస్తున్న కొద్దీ పంచాక్షరి స్వామి దొంగతనాల చిట్టా భారీగా ఉంది. అతడి వివరాలు.. అతడి జీవనశైలి తెలుసుకుని పోలీసులు విస్తుపోయారు.
పంచాక్షరి స్వామి నేరాల చిట్టా
దొంగతనాలు చేస్తూ 2016లో గుజరాత్ పోలీసులకు దొరికాడు. ఈ కేసులో స్వామికి ఆరేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. అహ్మదాబాద్‌లోని సబర్మతి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ దొంగతనాలు చేస్తూ బెంగళూరుకు మకాం మార్చాడు. జనవరి 9వ తేదీన బెంగళూరులోని మడివాలా ప్రాంతంలో ఒక ఇంట్లో దొంగతనం చేయగా.. పోలీసులు ఆ కేసులో పంచాక్షరి స్వామిని అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 181 గ్రాముల బంగారు బిస్కెట్లు, 333 గ్రాముల వెండి, ఇతర ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
తల్లికి ప్రభుత్వ ఉద్యోగం
దొంగిలించిన ఆభరణాలను మహారాష్ట్రలోని సోలాపూర్‌లోని తన ఇంట్లో ఉంచాడు. అయితే నేరాలు చేసిన అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా పంచాక్షరి స్వామి రోడ్డుపై బట్టలు మార్చుకునేవాడు. అతడు కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించగా.. తండ్రి మరణం తరువాత అతడి తల్లికి రైల్వే శాఖలో కారుణ్య నియామకం లభించింది.
హీరోయిన్‌కు రూ.3 కోట్ల లగ్జరీ ఇల్లు ఇచ్చిన గజదొంగ.. ఇక్కడే భారీ ట్విస్ట్
RELATED ARTICLES