పరువు హత్యల వల్ల ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో పరువు హత్యల్లో ఒక రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన కేసు ప్రణయ్ మర్డర్ కేసు.తన కుమార్తెను తమకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నాడనే కోపంతో అమృత అనే అమ్మాయి తండ్రి ప్రణయ్‌ను దారుణంగా హత్య చేయించాడు. అలా రోడ్డుపై అందరూ చూస్తుండగానే జరిగిన ప్రణయ్ హత్య కొన్నాళ్ల పాటు ప్రజలు మర్చిపోలేకపోయారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే భర్త మరణించడంతో అమృతపై అందరి ఫోకస్ పెరిగింది. అలా అమృత ప్రణయ్ ఒక సెలబ్రిటీగా మారింది. తాజాగా తన జీవితంలో జరుగుతున్న విశేషాలను పంచుకుంటూ అమృత ప్రణయ్ ఒక వీడియో విడుదల చేసింది.
డిస్టర్బ్ అయ్యాను
అమృత ప్రణయ్‌కు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో చాలానే ఫాలోయింగ్ ఉంది. అలాంటిది దాదాపు రెండేళ్ల నుండి ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్స్ అన్నీ ఆఫ్ చేసి పెద్దగా యాక్టివ్‌గా ఉండడం లేదు. అసలు అలా ఎందుకు చేస్తుందో చెప్పడం కోసం తాజాగా తన యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియో అప్లోడ్ చేసింది. తను పలు విషయాల వల్ల చాలా డిస్టర్బ్ అయ్యానని, అందుకే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేనని చెప్పుకొచ్చింది అమృత ప్రణయ్. ఇప్పటివరకు తనకు సపోర్ట్ చేస్తూ, తన గురించి పాజిటివ్‌గా మాట్లాడే వాళ్లకు రెస్పాండ్ అవుతానని తెలిపింది. తనకు సంబంధించిన విషయాలను తెలుసుకోవాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రశ్నలు అడగమని చెప్పి.. యూట్యూబ్ వీడియోలో వాటికి సమాధానాలు అందించింది.
మాట్లాడే మూడ్ లేదు
ముందుగా అసలు సోషల్ మీడియాలో ఎందుకు దూరంగా ఉన్నారనే ప్రశ్న ఎదురయ్యింది. యూట్యూబ్ నుండి తాను దూరంగా లేనని, చిన్న బ్రేక్ తీసుకున్నానని క్లారిటీ ఇచ్చింది అమృత ప్రణయ్ (Amrutha Pranay). గత రెండేళ్లుగా పెద్దగా యాక్టివ్‌గా లేనని, ఈసారి ఏకంగా 1 నెల బ్రేక్ తీసుకున్నానని తెలిపింది. ఇప్పుడు బ్రేక్ పూర్తయ్యిందని మళ్లీ యూట్యూబ్‌లో యాక్టివ్‌గా ఉంటానని చెప్పింది. సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత అమృత తన ఫ్రెండ్స్‌ను పట్టించుకోవడం లేదని ఆరోపణలు రాగా దానిపై కూడా తను క్లారిటీ ఇచ్చింది. తాను ఏ ఫ్రెండ్స్‌ను మర్చిపోలేదని, కానీ తనకు ఎవరితో మాట్లాడే మూడ్ లేకపోవడం వల్ల అందరికీ దూరంగా ఉన్నానని, త్వరలోనే మళ్లీ అందరికీ టచ్‌లోకి వస్తానని స్పష్టం చేసింది అమృత.ఒకప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో తన పేరు అమృత ప్రణయ్ అని ఉండేది. కానీ కొన్నిరోజుల క్రితం ప్రణయ్ అనే పేరును తొలగించింది అమృత. అలా ఎందుకు చేశారని తనను అడగగా.. తన వ్యక్తిగత జీవితం మీద ఎందుకు పడ్డారో తెలియడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను అయిదు నెలల క్రితమే పేరు మార్చానని, కానీ అది మారడానికి టైమ్ పట్టిందని తెలిపింది. అమృత వర్షిని అనేది తన పేరే అయినా దాని గురించి అందరూ ఎందుకు తప్పుబడుతున్నారని ప్రశ్నించింది. తన సొంత పేరును పెట్టుకునే హక్కు తనకు లేదా అని అడిగింది. ఇప్పటికైనా ఎందుకు మార్చానో అర్థమయ్యే ఉంటుందని టాపిక్ ఆపేసింది అమృత ప్రణయ్
డిస్టర్బ్ అయ్యాను, అందుకే అలా చేశాను.. క్లారిటీ ఇచ్చిన అమృత ప్రణయ్
RELATED ARTICLES