తెలుగుదేశం పార్టీ నేత వీరయ్య చౌదరి హత్య కేసును పోలీసులు ఛేదించారు. తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేశారు. అత్యంత సినిమా ఫక్కీలో జరిగిన ఈ హత్య కేసును పోలీసులు అన్ని రకాల ఆధారాలను సేకరించి తప్పించుకు తిరుగుతున్న నిందితులను పట్టుకున్నారు.నాగులుప్పలపాడుకు మంత్రి నారాలోకేశ్ పర్యటించి వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అంతకు ముందే నిందితులను పోలీసులు పట్టుకున్నారు. అయితే ఈ హత్య కేసులో మరికొందరు నిందితులు ఇంకా పరారీలోనే ఉన్నారని ప్రకాశం జిల్లా ఎస్సీ దామోదర్ తెలిపారు. వీరయ్య చౌదరి హత్యకు ఆధిపత్య పోరు కారణమని పోలీసులు తేల్చారు.
ఆధిపత్య పోరు…వీరయ్య చౌదరికి అనేక రకాల వ్యాపారాలున్నాయి. అందులో మద్యం, రియల్ ఎస్టేట్, ఇసుక వంటివి కూడా ఉన్నాయి. ఒంగోలులో నివసించే వీరయ్య చౌదరి తన వ్యాపారాలను నాగులుప్పలపాడు కేంద్రంగా నిర్వహించేవారు. అయితే తమ వ్యాపారాలకు అడ్డుతగులుతున్నాడని భావించిన ప్రత్యర్థులు వీరయ్య చౌదరిని మట్టుబెట్టడానికి పక్కా ప్లాన్ వేశారు. ఈ కేసులో అమ్మనబ్రోలకు చెందిన ఆళ్ల సాంబశివరావుతో పాటు అతని మేనల్లుడు ముప్పా సురేష్ లు ప్రధాన పాత్ర పోషించినట్లు పోలీసులు తెలిపారు. డబ్బులు ఎర చూపి వీరయ్య చౌదరిని మర్డర్ చేసేందుకు పథకం పన్నారు. అందుకు వీరిద్దరికీ దాసరివారిపాలెంకు చెందిన తోట శ్రీనివాసరావు సహకరించాడు. తోట శ్రీనివాసరావు సహకారంతో ఒంగోలు కు చెందిన బోర్లకుంట వినోద్ కుమార్ తో కలసి హత్యకు ప్లాన్ చేశారు. నెల్లూరుకు చెందిన…ఒంగోలుకు చెందిన వారయితే దొరికిపోతామని భావించిన వీరు పొరుగు జిల్లా నెల్లూరుకు చెందిన రౌడీషీటర్లను ఎంచుకున్నారు. వారికి రెండు లక్షల రూపాయల సుపరాీని కూడా చెల్లించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడయింది. ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా సుపారీ ఇవ్వడమే కాకుండా ఆధారాలను దొరకకుండా ప్రయత్నం చేశారు. గత నెల 22వ తేదీన ఒంగోలులో దారుణంగా హత్య చేశారు. తన కార్యాలయంలో ఉండగా కత్తులతో కొడవళ్లతో పొడిచి అతి కిరాతకంగా హత్య చేశారు. వీరయ్య చౌదరి మరణించాడని తెలుసుకున్న తర్వాతనే స్పాట్ నుంచి వెళ్లిపోయారు. తర్వాత ఎవరి దారిన వారు ఒంగోలు నుంచి పరారయి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. తొమ్మిది మంది అరెస్ట్…వీరయ్య చౌదరి హత్య కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రకాశం జిల్లా పోలీసులు ఈ కేసును ఛేదించడానికి ఎక్కువ సమయం తీసుకున్నప్పటికీ పక్కా ఆధారాలను సేకరించారు. నిందితులు ఎవరో తేల్చారు. ఇరవై ఐదు లక్షల రూపాయల మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారని ప్రాధమికంగా తేలినట్లు పోలీసులు తెలిపారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, హోం మంత్రి అనిత వీరయ్య చౌదరికి నివాళులర్పించేందుకు వచ్చి పోలీసులకు గట్టి సూచనలు ఇవ్వడంతో ఈ కేసును ఛేదించారు. ఈ కేసులో వినోద్ కుమార్, తువ్వర వంశీ కృష్ణ, బెల్లంకొండ వెంకటగౌతం, మన్నెం తేజ, మార్టూరి కిరణ్ కుమార్, షేక్ సమీర్, ఆళ్ల సాంబశివరావు, వీరగంధం దేవేంద్ర నాధ్ చౌదరి, తోటా శ్రీనివాసరావులను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు నిందితులు నాగరాజు, రుత్యేంద్ర బాబు, ముప్పా సురేష్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
వీరయ్య చౌదరి మర్డర్ కేసు మిస్టరీ వీడిందిలా… నిందితులు వాళ్లేనా
RELATED ARTICLES