spot_img
Sunday, July 20, 2025
spot_img

గ్రూప్‌ 2 శిక్షణకు హైదరాబాద్‌ వెళ్లి.. ఉగ్రవాదం వైపు మళ్లిన విజయనగరం యువకుడు. బాంబు పేలుళ్లకు కుట్ర

విజయనగరం జిల్లాకు చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ ఇంజనీరింగ్‌ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. అతని తండ్రి పోలీస్ శాఖలో ఏఎస్సైగా పనిచేస్తున్నాడు.అతని సోదరుడు కూడా అదే డిపార్ట్‌మెంట్‌లో ఉన్నాడు.తండ్రి సోదరుడి బాటలో ప్రభుత్వ ఉద్యోగంలో చేరతాడని కుటుంబ సభ్యులు భావించారు.

ఉద్యోగ ప్రయత్నాలతో పాటు గ్రూప్‌ 2 పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు శిక్షణ కోసం కుటుంబ సభ్యులు సిరాజ్‌ను హైదరాబాద్‌ పంపించారు. ఆన్‌లైన్‌లో ఉగ్రవాద ప్రచారాలకు ఆకర్షితుడైన సిరాజ్‌ హైదరాబాద్‌కు చెందిన మరో యువకుడితో కలిసి ఉగ్రవాద కార్యకలాపాలు ప్రారంభించాడు. సౌదీ నుంచి ఐసిస్‌ మార్గదర్శకాలతో అలజడి సృష్టించేందుకు బాంబుల తయారీ మొదలు పెట్టాడు.

ఆన్‌లైన్‌లో ప్రేరణ పొంది…

విజయనగరం జిల్లాకు చెందిన సిరాజ్‌, సికింద్రాబాద్‌ బోయిగూడకు చెందిన చెందిన సయ్యద్ సమీర్‌లను ఉగ్రవాద కార్యకలాపాలపై పోలీసులు అరెస్ట్ చేశారు. సిరాజ్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. గ్రూప్‌ 2 పరీక్షల కోసం హైదరాబాద్‌ వెళ్లాడు.

ఆన్‌లైన్‌ వేదికల్లో ఉగ్రవాద ప్రచారాలతో ప్రేరణ పొందారు. అల్ హింద్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ పేరిట సంస్థను ఏర్పాటు చేసి కార్య కలాపాలు సాగించారు. సిరాజ్‌ ఈ సంస్థను ఏర్పాటు చేస్తే సమీర్‌ దానిలో సభ్యుడయ్యాడు. వీరిద్దరికి సౌదీ అరేబియా నుంచి ఇంకా గుర్తించని ఉగ్రవాద సంస్థ హ్యాండ్లర్ ద్వారా దాడులు చేసేలా గైడ్ చేశాడు.

ఇన్‌స్టా గ్రామ్ ఖాతా ద్వారా ఆన్‌లైన్‌ యువకులను ఆకర్షించి వారిని భారత్‌లో దాడులు చేసేలా ప్రోత్సహించాడు. ఉగ్ర దాడుల కోసం పొటాషియం క్లోరేట్, సల్ఫర్ వంటి పేలుడు పదార్ధాల రసాయనాలను ఆన్లైన్‌లో తెప్పించుకున్నాడు.

బాంబుల తయారీలో శిక్షణ ఇచ్చి…

సౌదీకి చెందిన హ్యాండ్లర్ మ్యాజిక్‌లాంతర్‌ ద్వారా ఎంచుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఉగ్రవాదానికి అనుకూలంగా పోస్టులు పెట్టి వాటికి స్పందించే వారిని ఉగ్ర కార్యకలాపాలకు ఎంచుకుంటారు. అల్ హింద్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ పేరిట ఏర్పాటు చేసిన సంస్థలో మరో 28 మందిని చేర్చుకున్నారు.

అగ్గిపుల్లల్లోఉండే సల్ఫర్‌ వినియోగించి బాంబు తయారు చేసే విధానంపై హ్యాండ్లర్ వీరికి వీడియోలను పంపినట్లు తేలింది. వీటిని చూసి యువకులు రసాయనాలతో బాంబును తయారు చేశారు. ఒక బాంబును సిరాజ్ ఈ నెల 12న విజయనగరంలో ప్రయోగాత్మకంగా పరిశీలించాడు. మరో రెండు, మూడు రోజుల్లో తుది ప్రయోగాలు చేసేందుకు సిద్ధమయ్యాడు.

మే 21, 22 తేదీల్లో విజయనగరం పరిసరాల్లో బాంబుపేలుళ్లకు రిహార్సల్స్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌ రసాయిన పదార్ధాలను కొనుగోలు చేయడంపై నిఘా వర్గాలకు సమాచారం అందడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశారు. నిందితులు ఏర్పాటు చేసిన సంస్థ ద్వారా యువకులు, మైనర్లతో తరచూ సమావేశాలు నిర్వహించారు.

గ్రూప్-2 శిక్షణకు పంపితే..

సిరాజ్‌ తండ్రి ఏఎస్సై, సోదరుడు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. కొడుకును ప్రభుత్వ ఉద్యోగంలో చేర్చాలని భావించి గ్రూప్‌ 2 పరీక్షల శిక్షణ కోసం హైదరాబాద్‌ పంపారు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో పోస్టులతో ప్రేరణ పొందాడు. గ్రూప్‌ 2 కోచింగ్‌ పూర్తైన తర్వాత పరీక్షల కోసం విజయనగరం వచ్చేసినా హ్యాండ్లర్‌తో సంప్రదిస్తూనే ఉన్నాడు.

పేలుడు పదార్ధాల తయారీకి అవసరమైన పదార్ధాలను ఆన్‌లైన్‌లో తన ఇంటికి తెప్పించుకున్నాడు. వీరి కార్యకలాపాలపై నిఘా వర్గాలకు సమాచారం అందడంతో తెలంగాణ ఇంటెలిజెన్స్ వర్గాలు.. ఏపీ పోలీసులను ఆప్ర మత్తం చేశాయి. శనివారం విజయనగరంలో సిరాజ్ ఇంటిపై దాడి చేసి పేలుడు రసాయ నాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఏపీ, తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు సికింద్రాబాద్‌లో సమీర్‌ను అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ వారంట్‌పై విజయనగరం తరలించారు.

నిందితులకు రిమాండ్‌…

ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడటం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు.. కుట్రలు పన్నుతున్నారన్న అభియోగాలపై సిరాజ్‌, సమీర్‌లకు విజయనగరం కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది.

కొడుకును ఉన్నత స్థానంలో చూడాలని భావించిన తండ్రికి అంతులేని దు:ఖాన్ని మిగిల్చాడు. పోలీస్‌ కస్టడీలోకి తీసుకుని నిందితుల్ని విచారించనున్నారు. నిందితులు ఎక్కడ పేలుళ్లకు పాల్పడాలనుకున్నారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

సిరాజ్‌ను సౌదీ నుంచి గైడ్‌ చేసిన హ్యాండ్లర్‌ను ఐసిస్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. అతని ఇన్‌స్టా ఖాతాలను గుర్తించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ వ్యవహారంపై ఎన్‌ఐఏ ఏపీ పోలీసుల నుంచి సమాచారం సేకరించింది. కేసుదర్యాప్తును ఎన్‌ఐఏ చేపడుతుంది

హైదరాబాద్ నగరంలో పేలుళ్లకు ప్లాన్ చేసిన ఇద్దరిని ఆదివారం కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నిందితుల్లో ఒకరు విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మన్ కాగా, మరొకరు హైదరాబాద్ బోయిగూడకు చెందిన సయ్యద్ సమీర్ గా పోలీసులు గుర్తించారు. సిరాజ్ ఉర్ రెహ్మన్ డిగ్రీ చదువుకుని గ్రూప్-2 శిక్షణ నిమిత్తం విజయనగరం నుంచి హైదరాబాద్ వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇక సమీర్ నగరంలోనే లిఫ్ట్ ఆపరేటింగ్ సంస్థలో పనిచేస్తున్నాడని సమాచారం.

కేసు దర్యాప్తులో ప్రాథమిక ఆధారాల ప్రకారం ఈ ఇద్దరు ఆల్ హింద్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (అహిం) పేరిట సంస్థను ఏర్పాటు చేసి కార్యకలాపాలు సాగించారు. ఆ సంస్థకు సిరాజ్ నంబర్ వన్ గా, సమీర్ నంబర్ టుగా వ్యవహరించారని పోలీసులు చెబుతున్నారు.

సౌదీ అరేబియా నుంచి గుర్తు తెలియని ఉగ్రవాద సంస్థ హ్యాండ్లర్ ఉగ్రకుట్రలో కోసం వీరిని ఆపరేట్ చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలిందని సమాచారం. సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఇన్ స్టాగ్రామ్ లో సౌదీ హ్యాండ్లర్ నిందితులతో సంప్రదింపులు జరిపినట్లు చెబుతున్నారు. దేశంలో పేలుళ్లకు పథకం రచించడంతోపాటు అందుకోసం పొటాషియం క్లోరేట్, సల్ఫర్ వంటి పేలుడు రసాయనాలను ఆన్ లైన్ లో కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ రసాయనాలతో బాంబు తయారు చేసిన ఈ నెలలో విజయనగరంలో రిహార్సిల్స్ నిర్వహించాలని నిందితులు ప్లాన్ చేశారని, ఇంతలోనే వీరి విషయమై పోలీసులకు సమాచారం అందడంతో ఏపీ, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి కుట్రను భగ్నం చేశారని చెబుతున్నారు. కాగా, నిందితులు మరికొందరు యువకులు, మైనర్లతో సమావేశాలు నిర్వహించారని పోలీసుల దర్యాప్తులో తెలిసిందని చెబుతున్నారు. పేలుడు పదార్థాల కోసం రసాయనాలు తెప్పించడంతో హైదరాబాద్ పోలీసులు విజయనగరం పోలీసులకు సమాచారం పంపి నిందితుడు సిరాజ్ ను అదుపులోకి తీసుకున్నారని అంటున్నారు. అతడి ఇంట్లో సోదాలు నిర్వహించగా, పేలుడు రసాయనాలు లభ్యమయ్యాయని చెబుతున్నారు.

కాగా, సౌదీ హ్యాండ్లర్ గాలానికి నిందితులు ఎలా చిక్కారనే విషయంపై పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నారు. హ్యాండ్లర్ వీరిని ‘మ్యాజిక్ లాంతర్’ ద్వారా ఎంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియాలో ఉగ్రవాద అనుకూల పోస్టు పెట్టి, దానికి సానుకూలంగా స్పందించే (లైక్ మైండెడ్) వారిని ఎంచుకోవడమే ఈ ప్రక్రియ ఉద్దేశంగా చెబుతున్నారు. నిందితులు తమ గ్రూపులో మొత్తం28 మందిని చేర్చుకున్నారని గుర్తించారు. అగ్గిపుల్లల్లోని మందును వినియోగించి బాంబు తయారు చేసే విధానంపై హ్యాండ్లర్ వీరికి ఫైళ్లు పంపినట్లు తేలింది. దీనికి అనుగుణంగానే యువకులు బాంబును తయారు చేశారని, ఈ నెల12న సిరాజ్ విజయనగరం దాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించాడని పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular