spot_img
Monday, September 29, 2025
spot_img

డీమార్ట్ డిస్కౌంట్ల మర్మం.. తక్కువ ధరలకు నిత్యావసరాలు ఎలా అందిస్తోంది..?

తక్కువ ధరలకు నిత్యావసరాలు, ఇతర వస్తువులను విక్రయించే సంస్థల్లో డీమార్ట్ ముందువరుసలో ఉంటుంది. భారీ డిస్కౌంట్లకు పేరుగాంచిన ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 400కు పైగా స్టోర్లు ఉన్నాయి.రిటైల్ సంస్థల కంటే డీమార్ట్ తక్కువ ధరలకు వస్తువులు అందించడం ద్వారా వినియోగదారులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇంతకీ, డీమార్ట్ ఈ స్థాయిలో డిస్కౌంట్లు ఇవ్వడానికి వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటో తెలుసా? స్టాక్ మార్కెట్‌లో విజయవంతమైన పెట్టుబడిదారుడిగా రాధాకిషన్ ధమానీ సుపరిచితులు. ఆయన స్థాపించిన డీమార్ట్ కూడా అదే స్థాయిలో విజయవంతంగా కొనసాగుతోంది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ సుపరిచితమైన పేరు డీమార్ట్. వారాంతాల్లో డీమార్ట్ స్టోర్లు జనంతో కిక్కిరిసిపోతుంటాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, డీమార్ట్ సాధారణంగా జనసాంద్రత తక్కువగా ఉండే ప్రాంతాల్లో తమ స్టోర్లను ఏర్పాటు చేస్తుంది. దీనివల్ల ఆ ప్రాంతాల్లో భూముల ధరలు, అద్దెలు సహజంగానే పెరుగుతాయి.

ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన డీమార్ట్ ఇప్పుడు టైర్-2 నగరాలకు కూడా విస్తరించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా డీమార్ట్‌కు 415 స్టోర్లు ఉన్నాయి. డీమార్ట్ తక్కువ ధరలకు వస్తువులు విక్రయించడానికి ప్రత్యేక గుర్తింపు పొందింది. అయితే, ఇంత భారీ స్థాయిలో డిస్కౌంట్లు ఇవ్వడం వెనుక రాధాకిషన్ ధమానీ ప్రత్యేకమైన వ్యాపార వ్యూహం ఉంది. డీమార్ట్ ఎక్కడా కూడా అద్దె స్థలంలో స్టోర్లను తెరవకపోవడమే దీనికి ప్రధాన కారణం. సొంత స్థలాల్లో స్టోర్లు ఉండటం వల్ల నిర్వహణ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. అద్దె చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో, డీమార్ట్ తమ ఖర్చులలో 5-7 శాతం వరకు ఆదా చేస్తుంది. ఈ ఆదా చేసిన మొత్తాన్ని డిస్కౌంట్ల రూపంలో వినియోగదారులకు అందిస్తుంది.

అంతేకాకుండా, డీమార్ట్ ఎల్లప్పుడూ కొత్త స్టాక్‌ను అందుబాటులో ఉంచడానికి ప్రాధాన్యత ఇస్తుంది. 30 రోజుల్లో సరుకులను విక్రయించి, కొత్త వస్తువులను ఆర్డర్ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవడం ద్వారా పొందిన ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించాలనే ఉద్దేశ్యంతోనే డీమార్ట్ భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తుంది. తక్కువ ధరల కారణంగా వినియోగదారులు డీమార్ట్ స్టోర్లకు పోటెత్తుతున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో స్టాక్ త్వరగా అయిపోతుంది. దీనివల్ల డీమార్ట్ తయారీ సంస్థలకు పెద్ద మొత్తంలో ఆర్డర్లు ఇస్తుంది. దీంతో ఆయా సంస్థలు కూడా డీమార్ట్‌కు కొంత డిస్కౌంట్‌పై వస్తువులను సరఫరా చేస్తాయి. ఈ తగ్గింపును కూడా డీమార్ట్ ప్రజలకు డిస్కౌంట్ల రూపంలో అందిస్తుంది. ఇదే డీమార్ట్ విజయ రహస్యం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular