spot_img
Monday, September 29, 2025
spot_img

ఫ్రెండ్ ఇంటర్ సర్టిఫికెట్ దొంగిలించి ఎంబీబీఎస్ పూర్తిచేశాడు.. కష్టపడి చదివి డాక్టర్ అయ్యాడు..చివరకు ఎలా దొరికాడు సస్పెన్స్ .. థ్రిల్లర్ రియల్ స్టోరి

దొంగలించిన ఇంటర్ సర్టిఫికెట్  తో ఇంటర్మీడియట్ తో పాటు పలు పత్రాలు దొంగిలించి, గిరిజన కోటాలో ఎంబీబీఎస్ అడ్మిషన్ సంపాదించాడట. అనూహ్యంగా ఎంబీబీఎస్ పూర్తి చేసేశాడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రిజిస్ట్రేషన్ కూడా పొందాడు.యువకుడు డాక్టర్ గా చలామణి అయిపోయాడు.ఏకంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా పనిచేశాడు. అయితే.. తాజాగా పాపం పండటంతో అసలు విషయం బయటకు వచ్చింది.. బ్రతుకు బస్టాండైపోయింది! అలా అని ప్రైవేట్ గా ఓ క్లీనిక్ పెట్టుకుని నడిపించేస్తున్నాడు మరి ఎలా పట్టు బడ్డాడు అసలు ఏం జరిగింది రియల్ సస్పెన్షన్ స్టోరీ

మధ్యప్రదేశ్ లోని బబల్ పూర్ లో డాక్టర్ బ్రీజ్ రాజ్ ఉయ్కే గా నటిస్తున్న వ్యక్తి అసలు పేరు సత్యేంద్ర నిషాద్. ఈ సత్యేంద్ర తన స్నేహితుడు బ్రీజ్ రాజ్ ఇంటర్మీడియట్ తో పాటు పలు పత్రాలు దొంగిలించి, గిరిజన కోటాలో ఎంబీబీఎస్ అడ్మిషన్ సంపాదించాడట. అనూహ్యంగా ఎంబీబీఎస్ పూర్తి చేసేశాడు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రిజిస్ట్రేషన్ కూడా పొందాడు.

అనంతరం.. రెండేళ్లపాటు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేశాడు.. తర్వాత ప్రైవేటు రంగంలోనూ చేరాడు. అలా బ్రీజ్ రాజ్ గానే మారువేషంలో చలామణి అవుతున్నాడు. ఈ క్రమంలో ఓ ఘటన అతడి బ్రతుకు మొత్తాన్ని బయటపెట్టింది. అందుకు కారణం తాజాగా సంభవించిన ఓ రైల్వే అధికారి తల్లి మరణం!

రైల్వే అధికారి మనోజ్ కుమార్ అనారోగ్యంతో తన తల్లిని మార్బుల్ సిటీ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటికే ఆమె పరిస్థితి విషమించడంతో ఆమెకు వెంటిలేటర్ సహాయం అవసరమని వైద్యులు చెప్పారని అన్నారు. అయితే.. ఆస్పత్రిలో రికార్డులు తర్వాత కుటుంబం వెంటిలేటర్ ను నిరాకరించిందని పేర్కొన్నాయి. దీన్ని మనోజ్ తీవ్రంగా ఖండించారు.

ఈ సమయంలో తన తల్లికి చికిత్స చేసిన డాక్టర్ ఎవరో తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మళయాలి మెడికల్ థ్రిల్లర్ లాంటి విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా… డాక్టర్ బ్రీజ్ రాజ్ గా నటిస్తున్న వ్యక్తి వాస్తవానికి సత్యేంద్ర నిషాద్ అని.. అతడు డాక్టర్ కావడానికి తప్పుడు గుర్తింపును తీసుకున్నాడని తెలుసుకున్నారు!

దీంతో… వ్యవహారం పోలీస్ స్టేషన్ కు చేరింది. ఈ సమయంలో రోగులకు చికిత్స చేస్తున్న వ్యక్తి బ్రీజ్ రాజ్ కాదని, సత్యేంద్ర నిషాద్ అని తేలింది! అతడు నీట్ పాస్ చేయడానికి, ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి తన స్నేహితుడి నకిలీ పత్రాలు ఉపయోగించాడని తేలిందట. ప్రస్తుతం సత్యేంద్ర పరారీలో ఉన్నారు. పోలీసులు గాలిస్తున్నారు!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular