సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు కలసి అమరావతి రాజధాని వేశ్యల రాజధాని అని వ్యాఖ్యానించడంపై దుమారం రేగింది.
దానికి కొమ్మినేని శ్రీనివాసరావు వత్తాసు పలకడం పై అమరావతి మహిళలు ధ్వజమెత్తారు. అమరావతి మహిళల ఫిర్యాదును SC కమిషన్ చైర్మన్ కె.ఎస్.జవహర్, మహిళా కమిషన్ చైర్ పర్సన్ శైలజ రాయపాటి సుమోటో గా స్వీకరించారు. అదే విధంగా పలు పోలీస్ స్టేషన్ లలో అమరావతి మహిళలు ఫిర్యాదు చేశారు. దేవతల రాజధాని అమరావతి అని చంద్రబాబు అభివర్ణించినందుకు ప్రతిగా జరిగిన డిబేట్ లో అది దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అని, చుట్టూ వారే ఉన్నారని కృష్ణంరాజు తీవ్ర అనుచిత ఆరోపణలు చేశాడు. దేవతల రాజధాని అయితే హిందువుల దేవతలా? ముస్లిం దేవతలా? క్రైస్తవ దేవతలా అని ప్రశ్నించి మతాలను అంటగట్టే ప్రయత్నం చేశాడు.
ఆయన వ్యాఖ్యలను కొమ్మినేని శ్రీనివాసరావు సమర్ధిస్తూ అవును, తాను కూడా పత్రికల్లో చూసానని ఇద్దరూ వెటకారంగా మాట్లాడుకోవడం టెలికాస్టు అయింది. కనీసం బాధ్యత వహించి ఆ ఇద్దరు జర్నలిస్టులు అమరావతి మహిళలకు క్షమాపణ కూడా చెప్పలేదు. సాక్షి ఛానెల్ మాత్రం ఆ డిబేట్ కు యాజమాన్యంకు సంబంధం లేదని ప్రకటించి చేతులు దులుపుకుంది. నేటి ఉదయం కొమ్మినేని శ్రీనివాసరావు ఇంటికి పోలీసులు రావడంతో తన ఇంట్లోకి పోలీసులు రావడానికి వీలు లేదని చెప్పాడు. దాంతో బయట కుర్చీ వేసుకుని కూర్చున్నారు. కొద్ది సేపు విచారించి “అరెస్ట్ చేస్తున్నాం” అని చెప్పి తుళ్లూరు తరలించారు.
ఈ డిబేట్ లో పాల్గొన్న కృష్ణంరాజు పరారిలో ఉన్నాడు. అతని కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు “తాను సీనియర్ సిటిజన్ అని తనను ఎలా అరెస్ట్ చేస్తారు” అని ప్రశ్నించారు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖల చేసిన కేసులో కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు, సాక్షి యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారి పై పెట్టిన కేసులు వివరాలు ఇవి: 79, 196(1), 353(2), 299, 356(2), 61(1)BNS, 67 ITA-2008, 3(1)(U), SC, ST POA Act సెక్షన్లు..