spot_img
Saturday, July 19, 2025
spot_img

ప్రేమకు అడ్డు చెప్పాడని కన్న తండ్రిని హత్య చేసిన కూతుళ్లు.. కలకలం రేపుతున్న వరంగల్ ఘటన

తండ్రి అంటే చెట్టంత బలం. అలాంటి తండ్రిని జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రం ఇద్దరు కూతుళ్లు.. కర్కశంగా ప్రవర్తించారు. ప్రేమకు అడ్డు చెప్పాడని కన్న తండ్రినే పొట్టన పెట్టుకున్నారు.కంటే కూతుర్నే కనాలి.. కంటే కూతుర్నే కనాలి అంటారు.. తల్లిదండ్రులను కడవరకు కనిపెట్టుకుంటుంది. అంటే.. కూతురు అయితే తల్లిదండ్రులను కడవరకు కనిపెట్టుకుని ఉంటుందని దీని అర్ధం.. భిన్నంగా కొంత మంది కూతుళ్ల ప్రవర్తన.. కానీ కాలం మారింది. కలికాలం దాపురించింది. ఎందుకంటే కొంత మంది కూతుళ్లు దీనికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు..కన్న తండ్రికి కాలయముళ్లుగా మారి ఇద్దరు కూతుళ్లు

ప్రేమకు అడ్డు చెప్పడమే ఆయన చేసిన నేరం.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇద్దరు కూతుళ్లు.. కన్న తండ్రికి కాలయముళ్లుగా మారారు. ప్రేమకు అడ్డు చెప్పడమే ఆయన చేసిన నేరం. అతన్ని చిత్రహింసలు పెట్టి చంపేశారు ఇద్దరు కూతుళ్లు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. కూతుళ్లకు కన్న తల్లి కూడా సహకరించింది..చిన్నకూతురుకు సురేష్ అనే వ్యక్తితో పరిచయం తరుచూ ఫోన్ మాట్లాడుతున్న పల్లవికి తండ్రి మందలింపు.. ప్రేమను ఒప్పుకోని తండ్రిని చంపేందుకు పల్లవి స్కెచ్. ఇక్కడ చూడండి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు ధారావత్ కిషన్. మరిపెడ మండలం జెండాల తండాలో భార్య, ఇద్దరు కూతుళ్లతో జీవనం సాగిస్తున్నాడు. ఇద్దరు కూతుళ్లను అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. మంచి చదువు చెప్పించాడు. కాలేజీకి పంపించిన చిన్నకూతురుకు.. సురేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమకు దారి తీసింది. ఇంట్లో ఉండి తరచూ ఫోన్ మాట్లాడుతుండేది. ఇది ఓ రోజు కిషన్ కంట పడింది.

తరుచూ ఫోన్ మాట్లాడుతున్న పల్లవిని మందలించాడు తండ్రి కిషన్. కానీ అతన్నే పెళ్లి చేసుకుంటానని ఖరాఖండిగా చెప్పేసింది. దీనికి ఒప్పుకోని కిషన్.. కాస్తంత గట్టిగానే బదులు చెప్పాడు. ఐతే తన ప్రేమను ఒప్పుకోవట్లేదని ప్రియుడితో కలిసి తండ్రిని చంపేందుకు పల్లవి స్కెచ్ వేసింది..పల్లవికి సహకరించిన కిషన్ భార్య కావ్య, పెద్దకూతురు రమ్య .. పల్లవికి.. కిషన్ భార్య కావ్య, పెద్దకూతురు రమ్య కూడా సహకరించారు. పక్కటెముకలు విరగొట్టి, పిడుగుద్దులతో కిషన్ పైకి దాడి దిగారు ఇద్దరు కూతుళ్లు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కిషన్ మృతి చెందాడు. కిషన్ బంధువుల ఫిర్యాదుతో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు..పరారీలో చిన్న కూతురు, ప్రియుడు సురేష్. ప్రస్తుతం పోలీసుల అదుపులో కిషన్ భార్య కావ్య, కూతుళ్లు రమ్య, పల్లవి ఉన్నారు. చిన్న కూతురు ప్రియుడు సురేష్, అతని బంధువులు పరారీలో ఉండగా పోలీసులు వారికోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కన్న తండ్రినే చంపిన కూతుళ్ల విషయంపై స్థానికులు.. కలికాలం అని చర్చించుకుంటున్నారు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular