ప్రస్తుత సమాజంలో పెళ్లిళ్లు చేసుకోవడం విడిపోవడం అనేది చాలా తేలికైపోయింది. ముఖ్యంగా చాలామంది పిల్లలు పుట్టిన తర్వాత కూడా విడిపోయి మరో భాగస్వామితో కలిసి పోతున్నారు.అలా సినీ ఫీల్డ్ లో ఈ విడాకుల వ్యవహారం ఎక్కువైపోయింది. వీరిని చూస్తూ బయట సమాజం వారు కూడా విడాకుల వైపే ఎక్కువగా అడుగులు వేస్తున్నారు. పూర్వకాలంలో పెళ్లిళ్లు అయ్యాయి అంటే భార్యాభర్తలు మరణించే వరకు ఆ బంధం కొనసాగేది. చిన్న చిన్న గొడవలు వచ్చినా ఊళ్లో ఉండే పెద్దల మధ్య సర్ది చెప్పుకొని మళ్లీ కలిసి ఉండేవారు.పరిస్థితులలో చిన్నచిన్న మాటలతోనే విడిపోయి ఎవరికి వారు దూరంగా ఉంటున్నారు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శ్రావణ భార్గవి.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సింగర్ గా ఎంతో గుర్తింపు పొందిన ఈమె తన తోటి సింగర్ అయినటువంటి హేమచంద్రని వివాహం చేసుకుంది. ఈ దంపతుల ప్రేమకి గుర్తుగా ఒక అమ్మాయి కూడా పుట్టింది. కొన్ని సంవత్సరాలపాటు వీరి సంసారం బాగానే సాగిన ఆ తర్వాత ఏమైందో ఏమో ఇద్దరి గురించి విడాకుల వార్తలు ప్రతి రోజు సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి.. (Sravana Bhargavi)
ఇప్పటికి వీరిద్దరూ కలిసి ఉండట్లేదని వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు ఇద్దరు విడాకుల వైపు అడుగులు వేశారని ఎప్పుడో ఒకసారి విడాకులు తీసుకొని దూరమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. తాజాగా శ్రావణ భార్గవి చేసిన పోస్ట్ చూస్తే వీరు డైవర్స్ తీసుకోవడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. అయితే శ్రావణ భార్గవి పోస్ట్ చేసింది ఏంటయ్యా అంటే.. జీవితం చాలా సున్నితమైనది.. అవసరాలు చిక్కుముళ్ళు అపార్ధాలు, వివాదాలు గొడవలు.. వీటితో బతికేయడంలో అర్థం లేదన్నారు.. ఇందులో ప్రేమ మాత్రమే అర్థవంతమైనది.మనం ఒకరితో ప్రేమలో ఉన్నప్పుడు వారిని ఎక్కువగా ప్రేమించడానికి చూడాలి.. జీవితంలో మనం గెలిచామో? ఓడామో అదే డిసైడ్ చేస్తుందని శ్రావణ భార్గవి చెప్పుకొచ్చారు.. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొంతమంది నేటిజన్స్ ఈమె హేమచంద్రని ఉద్దేశించే ఈ పోస్ట్ పెట్టింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంటే ఈమె విడాకులు తీసుకోవడానికి సంసిద్ధం అయ్యాను అంటూ హింట్ ఇచ్చిందా అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Sravana Bhargavi)
భర్తతో విడాకులు తీసుకున్న శ్రావణ భార్గవి.. గొడవలు పడుతూ కలిసి ఉండలేమంటూ
RELATED ARTICLES