భార్య ప్రసవానికి పుట్టింటికి వెళ్లి వచ్చేసరికి భర్త ఇల్లు అమ్ముకుని పరారయ్యాడు. ఈ ఘటన కూకట్పల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం..వరంగల్జిల్లా చెన్నారావుపేటకు చెందిన శ్రావణ్, జనగామ జిల్లా కోమల్లకు చెందిన నిఖితకు నాలుగేండ్ల కింద పెండ్లయింది. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కాగా, కూకట్పల్లి పరిధి శాంతినగర్లోని ఆర్ఆర్ హోమ్స్లో నివసిస్తున్నారు. పెండ్లి సమయంలో ఇచ్చిన కట్నం డబ్బుతో పాటు లోన్తీసుకుని ఇదే అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొన్నారు.
గతేడాది నిఖిత ప్రసవం కోసం తల్లిగారింటికి వెళ్లింది. ఆమెకు పాప పుట్టి 11 నెలలు వచ్చినా కుటుంబ కలహాలతో భర్త దగ్గరికి రాలేదు. శుక్రవారం తల్లిదండ్రులతో కలిసి కూకట్పల్లిలోని తమ అపార్ట్మెంట్కు వెళ్లింది. తమ ఇంట్లో వేరే వారు ఉండటంతో షాక్ అయింది.
వారితో మాట్లాడగా శ్రావణ్ వద్ద ఫ్లాట్ కొన్నామని చెప్పారు. వెంటనే శ్రావణ్కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యలేదు. కొన్ని రోజులుగా తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని, ఇప్పుడు తనకు తెలియకుండానే ఇల్లు అమ్ముకుని పరారయ్యాడని నిఖిత ఆరోపించింది. కాసేపు ఆ ఇంటి వద్ద బైఠాయించి నిరసన తెలిపింది. అనంతరం కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరుపుతున్నారు.
భార్య ప్రసవానికి వెళ్లింది.. ఇల్లు అమ్ముకొని భర్త పరారయ్యాడు
RELATED ARTICLES