గత ఎన్నికల సమయంలో ఓ ప్రముఖ మీడియా ఛానల్‌లో చోటు చేసుకున్న “కార్ల పంచాయతీ” వ్యవహారం ఇప్పుడు ఆలస్యంగా బయటకు వస్తోంది. రాజకీయ నాయకుడు – రియల్ ఎస్టేట్ వ్యాపారిగా కోట్లకు అధిపతిగా పేరున్న ఓ వ్యక్తి విషయంలో తనపై నెగిటివ్ న్యూస్ రాకుండా చూడాలంటే ఏమివ్వాలి? అనే ప్రశ్నతో ఈ కథ మొదలైనట్టు విశ్వసనీయ సమాచారం.
ఈ వ్యవహారానికి మధ్యవర్తిగా వ్యవహరించిన వ్యక్తి మోకాళ్ల మీద పడి మరీ డీల్ కుదుర్చుకున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా ఖరీదైన కార్లు చేతులు మారినట్టు సమాచారం.
🚗 కిందిస్థాయి రిపోర్టర్‌కు ఆడి – పైస్థాయిలో అహంకారం?
ఈ డీల్‌లో భాగంగా ఛానల్ చీఫ్ కంటే కిందిస్థాయి రిపోర్టర్‌కు ఆడి కార్ అందినట్టు తెలిసింది.
దీంతో “నాకంటే నువ్వు పెద్ద కార్ తీసుకుంటావా? నీ సర్వీసులు అవసరం లేదు” అంటూ సదరు రిపోర్టర్‌ను విధుల నుంచి తొలగించినట్టు సమాచారం.
🧩 ‘వి’ పేరుతో మరో ఎపిసోడ్ – ఛానల్‌లోకి అడుగుపెట్టనివ్వని కుట్ర?
ఇదే ఛానల్‌లో మరో రిపోర్టర్ ‘వి’ పేరుతో అవకాశాలు దక్కించుకుని, ఇంకొక జర్నలిస్టును ఆ ఛానల్‌కు రానీయకుండా అడ్డుకున్నారన్న ఆరోపణలు కూడా తెరపైకి వచ్చాయి.
🎭 పైకి నీతులు – లోపల డీల్స్?
బయటకు పతివ్రతల్లా నీతులు మాట్లాడుతూ, ఎదుటివారిపై రాళ్లు విసురుతూ కాలం గడిపే కొందరు మీడియా పెద్దల నిజస్వరూపం ఇప్పుడు బయటపడుతోంది.
ఈ కార్లు ఏ షోరూం నుంచి వచ్చాయి? ఎవరు ఎంత చెల్లించారు? అన్న అన్ని వివరాలు, బిల్లులు, ఆధారాలు కోబ్రా న్యూస్‌కు అందినట్టు సమాచారం.
⚖️ ఎథిక్స్ మాట ఎక్కడ? దొంగ ఎవరు?
పేర్లతో సహా వెలుగులోకి తేవచ్చన్న స్థాయిలో ఆధారాలు ఉన్నా, జర్నలిజం ఎథిక్స్ అన్నది ఒకటి ఉందని కోబ్రా న్యూస్ భావిస్తోంది.
కానీ ఈ కార్ల పంచాయతీలో భాగమైన అందరికీ ఈ దెబ్బ గట్టిగానే తగలడం ఖాయం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
🚨 పోలీసుల దాకా చేరిన వ్యవహారం
ఈ వ్యవహారం బిట్స్ బిట్స్‌గా బయటకు వచ్చి, ఒక జర్నలిస్టు ఉద్యోగం కోల్పోవడం నుంచి పోలీసుల దాకా చేరినట్టు సమాచారం.
ఇప్పటికే ఈ గ్యాంగ్‌లో కొంతమందిని సస్పెన్స్‌లో పెట్టి, ఉద్యోగంలో ఉన్నట్టే ఉంచి విలువ లేకుండా పక్కన పెట్టినట్టు తెలిసింది.
📉 పెద్ద ఛానల్‌లో భారీ తొలగింపులకు సిద్ధమా?
ఇదే పెద్ద ఛానల్‌లో పదుల సంఖ్యలో ఉద్యోగాలు తీసేయడానికి కూడా సిద్ధమవుతున్నారన్న సంకేతాలు కలకలం రేపుతున్నాయి.
👉 ఈ కార్ల పంచాయతీ ఎక్కడ దాకా వెళ్తుంది?
ఎవరికి పోస్టింగ్‌లు? ఎవరికి బజారు?
కాలమే సమాధానం చెప్పాలి.
– కోబ్రా న్యూస్ ఎక్స్‌క్లూజివ్




