spot_img
Monday, July 21, 2025
spot_img

irctcconnect.apk.’ చాలా డేంజర్..ఈ యాప్ జోలికి అస్సలు వెళ్లకండి, రైల్వే ప్రయాణీకులకు IRCTC వార్నింగ్

ఒకటి కాదు రెండు కాదు రోజుకి వందల కొలది సైబర్ నేరాల..సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లలో వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు.సైబర్ కేటుగాళ్లు రకరకాల పద్దతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. ఇప్పటి వరకు బ్యాంకులు, డిజిటల్ అరెస్టుల పేరుతో మోసాలకు పాల్పడగా, ఇప్పుడు మరో రూపంలో అక్రమాలకు తెరలేపారు.రైల్వే శాఖ డేంజర్ యాప్ పట్ల హెచ్చరిక జారీచేసింది.IRCTCలా కనిపించే నకిలీ యాప్స్ ను అస్సలు ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోకూడదని తేల్చి చెప్పింది. IRCTC నకిలీ యాప్స్ తో కస్టమర్లకు సంబంధించిన UPI, ఇతర ముఖ్యమైన బ్యాంకింగ్ సమాచారంతో పాటు వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించింది. ఇలాంటి యాప్స్ పట్ల అలర్ట్ గా ఉండాలని సూచించింది.irctcconnect.apk.’ చాలా డేంజర్ ఒకవేళ మీరు రైలు టిక్కెట్ల బుకింగ్ కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెబ్‌సైట్ లేదంటే యాప్‌ని ఉపయోగిస్తుంటే.. కాస్ల జాగ్రత్తగా ఉండండి. IRCTC పేరుతో ‘irctcconnect.apk.’ అనే అనుమానాస్పద ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ డౌన్ లోడ్ చేసుకోవాలంటూ సామాజిక మాధ్యమాలలో సర్క్యులేట్ అవుతోంది. ఈ యాప్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇన్ స్టాల్ చేసుకోకూడదని IRCTC ప్రజలను హెచ్చరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి ప్రముఖ మెసేజింగ్ యాప్‌ల ద్వారా ఈ డేంజరస్ యాప్‌ చెలామణి అవుతుందని వెల్లడించింది. ఈ apk ఫైల్ ఇన్‌ స్టాల్ చేస్తే మీ మొబైల్ ఫోన్ లోని సమాచారాన్ని ఆగంతకులు దోచుకునే అవకాశం ఉందని వెల్లడించింది. ఇలాంటి అనుమానాస్పద అప్లికేషన్ల పట్ల అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యమని తెలిపింది.ఇలాంటి యాప్ వల్ల ఇబ్బందులు తలెత్తితే వెంటనే 1930 కు కాల్ చేయ్యాలి అని సైబర్ క్రైమ్ పోలీసులు చెచ్చరిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular