spot_img
Monday, March 23, 2026
spot_img

NIA అదుపులో యూట్యూబర్ సన్నీ యాదవ్..పాకిస్తాన్ తో లింక్ లపై ఆరా

కొంత‌కాలంగా బెట్టింగ్ యాప్స్ వ్య‌వ‌హ‌రంలో హాట్ టాపిక్‌గా ఉన్న బ‌య్యా స‌న్నీ యాద‌వ్ ను గురువారం ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు

గ‌త కొంత‌కాలంగా బెట్టింగ్ యాప్స్ వ్య‌వ‌హ‌రంలో హాట్ టాపిక్‌గా ఉన్న బ‌య్యా స‌న్నీ యాద‌వ్ (Bayya Sunny Yadav) ను గురువారం అనూహ్యంగా NIA అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇప్పుడు ఈ వార్త రెండు తెలుగు రాష్ట్రాల‌లో సంచ‌ల‌నంగా మారింది.ఇటీవ‌ల భారత్‌, పాక్ యుద్దం, ఉద్రిక్త వాతావ‌ర‌ణం నేప‌థ్యంలో ప‌లు యూట్యూబ‌ర్స్ పాక్ కు గూడ‌చ‌ర్యం చేసిన‌ట్లు నిర్దార‌ణ అయిన విష‌యం తెలిసిందే. ఈక్ర‌మంలో ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశ వ్యాప్తంగా పంజాబ్, హర్యానా, గుజరాత్, రాజస్థాన్‌లకు చెందిన 11మందిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇదిలాఉంటే ఇటీవ‌లే బ‌య్యా స‌న్నీ యాద‌వ్ (Bayya Sunny Yadav) పాకిస్తాన్‌లో బైక్ రైడ్ చేసి వ‌చ్చిన నేప‌థ్యంలో అత‌నిపై ప‌లు ఆరోప‌ణ‌లు లేక అనుమానాల నేప‌థ్యంలో సన్నీ యాదవ్‌ను NIA అధికారులు గురువారం చెన్నై విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఈ సంద‌ర్భంగా పాకిస్తాన్ పర్యటన వివరాలపై అతడిని విచారిస్తున్నారు

గ‌త మూడు నాలుగేండ్లుగా దేశ‌, విదేశాల‌లో బైక్ రెడ్స్ చేస్తూ కంటెంట్ సృష్టిస్తూ త‌న యూట్యూబ్ ఛాన‌ల్ ద్వారా చాలామంది ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యాడు. ఈక్ర‌మంలో త‌న ఛాన‌ల్‌లో కొన్ని ప్ర‌మోష‌న‌ల్ యాడ్స్ చేసి చిక్కుల్లో చిక్కుకున్నాడు. దీంతో అత‌నిపై ఏపీ, తెలంగాణ‌ల్లో కేసులు న‌మోద‌య్యాయి కూడా.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular