ఒకప్పుడు సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటూ మంచి క్రేజీ అందుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ పలు సినిమాలలో చిన్నచిన్న పాత్రలలో నటించి ఏకంగా బేబీ సినిమాతో హీరోయిన్గా మారిపోయింది. ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అందుకున్నది. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్లలో బాగా క్రేజీ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య నిరంతరం యాక్టివ్గానే ఉంటుంది.కానీ ఆ సినిమా వల్ల పెద్దగా అవకాసాలు రావడం లేదు అని తెలుస్తోంది వచ్చిన a టైప్ సినిమాలు రావడం తో బేబి సినిమా నిర్మాతలకి, డైరెక్టర్ కి మంచి పేరు తెచ్చింది కానీ తనకు నిరాశే ఎదురౌతుంది అని ఫీల్ అవుతున్నట్టు తెలుస్తోంది
బేబీ సినిమాలో హీరోయిన్గా నటించి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న వైష్ణవి ఈ చిత్రంలో ఈమె క్యారెక్టర్ చేసినందుకుగాను ప్రతి ఒక్కరి చేత ప్రశంశాలు అందుకోగా చాలామంది ఈమెను విమర్శించడం జరిగింది ఇప్పటికీ అదే కొనసాగుతుంది యూత్ లో ఎంటో క్రేజ్ తెచ్చిన బ్యాడ్ రిమార్క్ అలానే కొనసాగుతుంది. బేబీ సినిమాతో పేరైతే వచ్చింది కానీ ఇప్పుడు ఈమెకు ఆఫర్లు మాత్రం పెద్దగా రావట్లేదని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.. దీంతో వైష్ణవి చైతన్య బేబీ సినిమా చేసి చాలా తప్పు చేశానని బాధపడుతున్నట్లు తన స్నేహితులతో చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
బేబీ సినిమా తర్వాత ఫుల్ బిజీ అవుతారు అనుకున్నప్పటికీ కానీ అది కుదరలేదట.దీంతో అనవసరంగా ఈ సినిమా చేశారని తన పైన పలు రకాల నెగిటివ్ కామెంట్స్ వచ్చాయని అమే తన స్నేహితులతో చెప్పినట్లు సమాచారం. షార్ట్ ఫిలిం చేసుకుంటూ ఉంటే బాగుండేది ఏదోఒక టైం లో హిట్ సినిమా తగిలేది కానీ సినిమా హిట్ అయినా ఇప్పుడు హీరోయిన్ గా మారి ఆఫర్స్ లేక అటు షార్ట్ ఫిలిమ్స్ చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నట్లు వైష్ణవి చైతన్య చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్కే ప్రొడక్షన్ హౌస్ లో మరొక సినిమా చేసే అవకాశం ఉందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. కానీ డైరెక్టర్ సాయి రాజేష్ హీరో ఆనంద్ దేవరకొండ మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నారు.