ప్రేమకు అడ్డొస్తున్న స్నేహితుడు నవీన్‌ను గుండె చీల్చి.. మొండెం వేరు చేసి అతి దారుణంగా హతమార్చిన హరిహరకృష్ట..హస్సేన్, ప్రియురాలు కట్ట నిహారికారెడ్డిని అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు అరెస్ట్ చేశారు.ప్రస్తుతం అందరూ బెయిల్ పై బైట ఉన్నారు.. నవీన్ ను కిరాతకంగా చంపిన హరిహరకృష్ట ను కచ్చితంగా చంపుతాము అని ఆప్పట్లోనే నవీన్ తమ్ముళ్లు హెచ్చరించారు.. పోలిస్ లు వారికి కౌన్సెలింగ్ ఇచ్చి నిందితునికి శిక్ష పడేలా చూస్తాం అని చెప్పడం తో కామ్ గా ఉన్నారు..హరిహరకృష్ట ఎలాంటి ఎవిడెన్స్ లో దొరక్కుండా తాను చేసిన హత్య విషయం లో ముందుగానే నవీన్ ను చంపడానికి యూట్యూబ్ పోస్ట్ మార్టం వీడియోలు చూసి మరి చేశాడు
ఇదే కాక కేసులో ప్రాసిక్యూషన్ నిలబడకుండా ఉండాలి అంటే ఎలా తప్పించుకోవాలి అని ఇంటర్నెట్ లో ఐపిసి సెక్షన్స్ చదివి అవగాహన తెచ్చుకొని మరి హత్య చేసినట్టు అప్పట్లో పోలీసుల విచరణతో హరిహరకృష్ట తెలిపాడు.అందుకే హత్యకు ఉపయోగించిన కత్తి నీ దొరక్కుండా చేసి బట్టలను తగల బెట్టడం జరిగిందని పోలిస్ విచారణ లో హరిహరకృష్ట తెలిపాడు.తన కేసు ప్రాసిక్యూషన్ లో నిరుపించలేరు అని ధీమాగా ఉన్నాడు..మరో వైపు నవీన్ బందువులు ఎలక్షన్ టైం లో అదును చూసుకొని హరిహరకృష్ట నీ చంపి పగ తీర్చుకుందామని రెక్కీ కూడా వేసినట్టు సమాచారం..ఈ హత్యకు కారణం అయిన నిహారికా రెడ్డి పై కూడా వారు కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది..అగ్ని ఆరిపోయింది అనుకుంటున్న మళ్ళీ ఎప్పుడు ఏ క్షణాన ఈ మారణ కాండ కనసాగుతుందో నని పోలీసులు నిఘా పెట్టారు..