ఉరుకుల పరుగుల జీవితం లో పిల్లల్ని పెంచడానికి కేర్ టేకర్ లను పెట్టుకుంటున్నారు..వాళ్ళు ఆఫీస్ కు వెళ్ళే సమయం లో బేబీ సిట్టర్ లో పెట్టీ ఆఫీస్ కు వెళుతున్నారు..ఇక్కడ అంతా సేఫ్టీ గా ఉంటుంది అన్న నమ్మకం ..ఎప్పటి కప్పుడు మొబైల్ ల్లో cc cam లో కూడా చూసుకునే సదుపాయం ఉంది..అందుకే బేబీ సిట్టర్. లొ పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడని నమ్మి.. తల్లిదండ్రులు అతనివద్ద వదిలి వెళ్తే.. వారిపట్ల పాశవిక చర్యలకు పాల్పడ్డాడు.అసలు విషయం ఆలస్యంగా తెలిసింది
ఆ రాక్షసుడి 17 మంది చిన్నారులను లైంగికంగా వేధించాడు. ఓ పిల్లాడి తల్లి ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారణలో అతనిపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలాయి. దాంతో న్యాయస్థానం 34 ఏళ్ల మాథ్యూ జక్ర్ జెవ్స్కీ కు కోర్టు అన్ని సాక్ష్యాలు పరిసిలించి 707 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ దుర్మార్గుడిని క్షమించేదే లేదని, మనిషి రూపంలో ఉన్న రాక్షసుడని కోర్టు పేర్కొంది. ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగింది.
అసలు జరిగింది ఇది
బేబీకేరింగ్ సేవలందించే మాథ్యూ.. 2014 నుంచి 2019 మధ్య తనవద్ద ఉండే 17 మంది పిల్లలకు అశ్లీల చిత్రాలు చూపించి.. లైంగికంగా వేధించేవాడని తేలింది. జంట లగునా అనే మహిళ.. మాథ్యూ తన పిల్లాడిని అనుచితంగా తాకాడని 2019 మే నెలలో ఫిర్యాదు చేయడంతో.. మాథ్యూ దారుణాలు ఒక్కొక్కటికా వెలుగుచూశాయి. 2019 మే 17న మాథ్యూను పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేయగా.. 12 సంవత్సరాల పిల్లలపై 34 నేరాలకు పాల్పడినట్లు తేలింది. దాంతో కాలిఫోర్నియా కోర్టు అతడికి 707 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఇంత కఠిన శిక్ష పడినా.. మాథ్యూలో కొంచమైనా పశ్చాత్తాపం లేకపోగా.. అతను నవ్వుతూనే ఉండటం గమనార్హం. పైగా.. తీర్పు వెలువరించే ముందు న్యాయమూర్తి ఎదుట.. తాను పిల్లలను ఆనందాన్నే పంచానని చెప్పడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.