కాకినాడలో యువ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అశోక్‌నగర్‌కు చెందిన వైద్యుడు నున్న శ్రీకిరణ్ (32) శనివారం గడ్డి మందు తాగాడు.కుటుంబసభ్యులు అతడిని కాకినాడ జీజీహెచ్‌హెచ్‌కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించాడు. ఆస్తి విషయమై శ్రీకిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు.
కాకినాడ జీజీహెచ్ మార్చురీ విభాగంలో డ్యూటీ చేస్తున్నాడు. భూవివాదం పరిష్కారం కోసం వైసీపీ నేతల సాయం కోరగా.. ఆస్తి పత్రాలు తీసుకుని వేధింపులకు గురిచేశారంటూ శ్రీకిరణ్ తల్లి రత్నం ఆరోపిస్తున్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు సోదరుడు కల్యాణ్ కృష్ణ, అతడి అనుచరుడు పెదబాబులే తన కొడుకు మరణానికి కారణమని వారు ఆరోపిస్తున్నారు.
మాజీమంత్రి కన్నబాబు సోదరుల బెదిరింపులతో మనస్తాపానికి గురై తన కొడుకు బలవన్మరణానికి పాల్పడ్డాడని…తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని శ్రీకిరణ్ తల్లి రత్నం డిమాండ్ చేస్తోంది.మరోవైపు మాజీమంత్రి కన్నబాబు తమ్ముడు కల్యాణ్ కృష్ణకి చెందుర్తి ప్రాంతంలో 6 ఎకరాల భూమిని వైద్యులు అమ్మినట్లు తెలుస్తోంది. అందుకు బంధించి రూ. 25 లక్షలు ఇవ్వకుండా కన్నబాబు సోదరుడు, ఆయన అనుచరులు బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో ఎకరానికి సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకొని ఇవ్వకుండా వేధింపులకు పాల్పడటంతో యువడాక్టర్ శ్రీకిరణ్ తట్టుకోలేకపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కొన్ని రోజులుగా మాజీ మంత్రి కన్నబాబు తమ్ముడు అనుచరులతో డబ్బు లు..డాక్యుమెంట్లు కోసం వైద్యుడు సంప్రదింపులు జరిపారని అయినప్పటికీ ఇవ్వకుండా వేదిస్తుండడంతో మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
రష్యాలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన శ్రీకిరణ్.. కాకినాడ జీజీహెచ్ మార్చురీ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఆస్తి విషయంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు సోదరుడు కల్యాణ్‌కష్ణ, అతడి అనుచరుడు పెదబాబు, వైసీపీ నేతలు తన కుమారుడిని మోసం చేశారని శ్రీకిరణ్ చౌదరి తల్లి రత్నం ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని శ్రీకిరణ్ తి తల్లి కోరుతున్నారు.