శ్రీకాకుళం జిల్లా గార ఎస్‌బీఐలో ఘటన చోటు చేసుకుంది బ్యాంక్ లో 7 kg ల బంగారం మాయం అవ్వడం తో ఉద్యోగులపై అనుమానం.. ఈ నేపథ్యం లో బ్యాంక్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదుఆత్మహత్యకు పాల్పడిన మహిళా ఉద్యోగినీ.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళం జిల్లా గారలోని స్టేట్ బ్యాంక్ శాఖలో ఖాతాదారులు కుదువ పెట్టిన 7 కేజీల బంగారు ఆభరణాలు గల్లంతయ్యాయి.
ఇది ఇంటి దొంగల పనే గుర్తించిన ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడం.. ఈలోపు ఒక మహిళా ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. గార ఎస్‌బీఐ శాఖలో ఆభరణాలు కుదువపెట్టి రుణాలు తీసుకున్న ఖాతాదారులు నగదు చెల్లించినా వాటిని తిరిగి ఇవ్వకపోవడంతో కొద్దిరోజులుగా అధికారులను నిలదీస్తున్నారు. నగలు గల్లంతయ్యాయనే ప్రచారంతో నవంబరు 27న ఖాతాదారులు ఆందోళనకు దిగారు.
శ్రీకాకుళం ప్రాంతీయ అధికారి టీఆర్‌ఎం రాజు బ్యాంకుకు చేరుకుని, ఆడిట్ కారణంగా జాప్యం జరుగుతోందని.. వదంతులు నమ్మవద్దని వారికి నచ్చజెప్పారు. డిసెంబరు 8 వరకు వేచి ఉంటే ఆభరణాలకు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. ఇంతలో బ్యాంకులో బంగారంపై రుణాలిచ్చే బాధ్యతలు చూసే డిప్యూటీ మేనేజరు ఉరిటి స్వప్నప్రియ (39) నవంబరు 29న ఆత్మహత్యకు పాల్పడడంతో కలకలం రేగింది.
ఖాతాదారుల్లో అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. నగలు మాయమయ్యాయని అంతర్గత విచారణలో గుర్తించినా అధికారులు బయటకు పొక్కనీయలేదు. ఇందులో నిందితురాలిగా పేర్కొన్న స్వప్నప్రియను గత నెల 20 నుంచే సెలవుపై పంపారు. ఆ తరువాత రెండుసార్లు విచారణకు పిలిపించారు. చివరకు ఆమె ఆత్మహత్యకు పాల్పడడంతో చేసేది లేక గురువారం పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనలో తమ ఉద్యోగులపైనే అనుమానం ఉందని బ్యాంకు ప్రాంతీయ అధికారి రాజు, బీఎం సీహెచ్.రాధాకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.4.07 కోట్ల విలువైన 7 కేజీల ఆభరణాలు కనిపించడంలేదని అందులో పేర్కొన్నారు.