ఒకప్పుడు హత్యకు అనేక కారణాలు ఉండేవి కానీ ఇప్పుడు ..ఏకారణం లేకుండా అకారణంగా హత్యలు చేస్తున్నారు..బిర్యాని విషయంలో హత్య చేసిన దౌర్బాగ్య ఘటన ఇటీవల ఢిల్లీలో చోటు చేసుకుంది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 60 సార్లు విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈశాన్య ఢిల్లీలోని వెల్‌కమ్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ 18 ఏళ్ల యువకుడు ఆ వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా.. అతనిపై 16 ఏళ్ల నిందితుడు ఒక్కసారిగా దాడి చేశాడు. ఆ టీనేజ్ వ్యక్తి ప్రతిఘటించడంతో..
నిందితుడు వెంటనే తన దగ్గరున్న కత్తి తీసుకొని పొడవడం మొదలుపెట్టాడు. వెనువెంటనే కత్తిపోట్లు పొడవడంతో.. ఆ వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అనంతరం ఒక ఇరుకైన సందులో అతడ్ని ఈడ్చుకొని వెళ్లడం సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. అతడు చనిపోయేంతవరకు మెడపై కత్తితో పొడుస్తూనే ఉన్నాడు. చనిపోయాడా? లేదా? అని నిర్ధారించుకొని మరీ పొడిచాడు. చివరికి.. ఆ 18 ఏళ్ల టీనేజ్ అబ్బాయి చనిపోయాడని తెలిసి నిందితుడు మృతదేహం పక్కనే డ్యాన్స్ చేశాడు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జాయ్ టిర్కీ ఈమేరకు వివరాలు వెల్లడించారు. 18 ఏళ్ల యువకుడ్ని దోచుకునే క్రమంలో.. 16 ఏళ్ల బాలుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తేలింది. సీసీటీవీ ఆధారంగా తాము వెంటనే నిందితుడ్ని పట్టుకొని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. నిందితుడిని తమదైన శైలిలో విచారించగా బిర్యానీ తినడం కోసం మృతుడిని హతమార్చి రూ.350 దోచుకున్నట్టు నిందితుడు వెల్లడించడంతో పోలీసులు విస్తూ పోయారు




