spot_img
Monday, March 23, 2026
spot_img

కోర్టు ఆవరణలో పెట్రోల్‌ ఒంటిపై పోసుకొని వ్యక్తి ఆత్మహత్మ యత్నం

గోదావరిఖని వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కోర్టు కాంప్లెక్స్‌ ఆవరణలో స్థానిక రాజీవ్‌నగర్‌కు చెందిన మేకల పోశం అలియాస్‌ గ్యాస్‌ పోశం ఆత్మహత్యాయత్నం చేశాడు.

పోలీసుల కథనం ప్రకారం.. పోశంకు రాజీవ్‌నగర్‌కే చెందిన మహేశ్‌తో పాత గొడవలున్నాయి. ఈ నెల 3న ఇద్దరూ గొడవ పడ్డారు. మహేశ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

దీంతో పోశం మంగళవారం కోర్టు ఆవరణలోకి వచ్చి, వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకున్నాడు. తనకు న్యాయం చేయాలంటూ నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా అక్కడే విధుల్లో ఉన్న ఎన్టీపీసీ ఠాణా కానిస్టేబుల్‌ పురుషోత్తం, వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ కానిస్టేబుల్‌ అభి, కోర్టు హోంగార్డు నాగేశ్వర్‌రావులు అడ్డుకున్నారు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించి, బాధిత కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular