ఒక్క టాలీవుడ్ పరిశ్రమకు చెందిన వారే కాకుండా ఇతర రాష్ట్రాల సినీ ప్రముఖులు సైతం నిత్యం ఏదో ఒక కారణం వల్ల మృతి చెందుతూ ఉన్నారు.
ఈ క్రమంలోనే మరో సీనియర్ నటి కన్నుమూసింది. ఈమె కూడా పక్క ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి. వివరాల్లోకి వెళితే… కన్నడ సీనియర్ నటి అయిన లీలావతి ఈరోజు కన్నుమూశారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఈమె.. బెంగళూరులోని ఓ ప్రైవేట్ హాస్పటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
ఈమె కన్నడ తో పాటు తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలలో కూడా నటించారు. మొత్తంగా లీలావతి 600 కి పైగా సినిమాలలో నటించారు. ఇక తెలుగులో అయితే ‘ మర్మయోగి, కార్తీకదీపం, ఇది కథ కాదు ‘ వంటి సినిమాలలో నటించారు. ఇక ప్రస్తుతం ఈమె వయసు 87 ఏళ్ళు అయినట్లు తెలుస్తుంది.




