spot_img
Monday, March 23, 2026
spot_img

తన ఫోటోకు తానే ‘RIP’ అని పెట్టుకొని సూసైడ్ చేసుకున్న యువకుడు

తన ఫోటోకు తానే ‘RIP’ అని పెట్టుకొని సూసైడ్ చేసుకున్న ఘటన కేరళలో జరిగింది. కేరళలోని అలువాకు చెందిన 28 ఏళ్ల అజ్మల్ షరీఫ్ తన ఇన్‌స్టాగ్రమ్ పేజీలో తన మరణవార్తను పోస్టుగా పెట్టి ఆత్మహత్యు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు

అజ్మల్ తన ఫోటోతో పాటు ‘RIP అజ్మల్ షెరీఫ్ 1995-2023’ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను ఉంచినట్లు పోలీసులు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో అజ్మల్ షరీఫ్ అనే వ్యక్తి తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంచి ఉద్యోగం రాకపోవడంతో కాస్త డిప్రెషన్‌లో ఉన్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. పోస్టుమార్టం తర్వాత అజ్మల్ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అజ్మల్ ఇన్‌స్టాగ్రామ్‌ పేజీకి 14 వేల మంది ఫాలోవర్లు ఉండటం గమనార్హం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular