spot_img
Wednesday, March 25, 2026
spot_img

డిసెంబర్ 31 వేడుకలపై ఆంక్షలు – సైబరబాద్ నూతన కమిషనర్

సైబరా బాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించారు అవినాష్ మహంతి. ఈ సందర్భంగా అవినాష్ మహంతి మాట్లాడుతూ…సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కీలకమైన సంస్థలు ఉన్నాయన్నారు.నిష్పక్షపాతంగా ప్రజలకు సేవ చేయడంతో పాటు చట్టబద్ధంగా పని చేస్తామని చెప్పారు. మా వద్ద ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ భద్రత,రక్షణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని వివరించారు

అతిపెద్ద సమస్యగా మారిన సైబర్ క్రైమ్స్ పై ప్రత్యేక దృష్టి పెడతామని పేర్కొన్నారు. అన్ని రకాల కేసులను నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తాం..సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూస్తామని వివరించారు. ట్రాఫిక్ సమస్య పరిష్కరించడానికి కొత్తగా ప్రణాళికలు సిద్ధం చేస్తాం..రెగ్యులర్ క్రైమ్స్ పై దృష్టి సారిస్తామని వెల్లడించారు. డ్రగ్స్ పై ప్రత్యేక నిఘా ఉంచడమే కాకుండా డ్రగ్స్ ఎక్కడినుండి వస్తున్నాయి ఆన్న అంశాలపై విచారణ చేస్తామన్నారు అవినాష్ మహంతి. 31 డిసెంబర్ రోజున వేడుకలు పోలీస్ నిబంధనలు అనుగుణంగా జరుపుకోవాలి…పబ్బులు ఫామ్ హౌస్ లపై అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెడతామని హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular