spot_img
Wednesday, March 25, 2026
spot_img

హైదరాబాద్‌ కొత్త పొలీస్ కమిషనర్ ఆన్ డ్యూటీ- స్ట్రిక్ట్ వార్నింగ్..!రేవ్, వీకెండ్ పార్టీల పేరుతో డ్రగ్స్‌ను వినియోగిస్తే సహించమని హెచ్చరిక

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలను స్వీకరించారు. బంజారాహిల్స్‌లోని పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ టవర్‌లో గల కార్యాలయంలో ఈ ఉదయం సందీప్ శాండిల్య నుంచి ఛార్జ్ తీసుకున్నారు.

1994 బ్యాచ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. రాష్ట్ర విభజన సమయంలో ఆయనను తెలంగాణకు కేటాయించింది డీఓపీటీ. వివిధ పోస్టుల్లో పని చేశారాయన. నిన్నటివరకు ఆర్గనైజేషన్ అండ్ లీగల్ విభాగం అదనపు డైరెక్టర్ జనరల్‌గా పని చేశారు.

ఆయనను నగర పోలీస్ కమిషనర్‌గా బదిలీ చేసింది రేవంత్ ప్రభుత్వం. ఆ స్థానంలో ఉన్న సందీప్ శాండిల్య యాంటీ నార్కొటిక్స్ బ్యురో డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం అదనపు కమిషనర్‌ జీ సుధీర్ బాబుకూ స్థానచలనం కలిగింది. ఆయనను రాచకొండ పోలీస్ కమిషనర్‌గా బదిలీ చేశారు. అక్కడున్న దేవేంద్ర సింగ్ చౌహాన్‌కు పోస్టింగ్ ఇవ్వలేదు ప్రభుత్వం.

సైబరాబాద్ జాయింట్ కమిషనర్ (అడ్మిన్) అవినాష్ మహంతి బదిలీ అయ్యారు. సైబరాబాద్ కమిషనర్‌గా అపాయింట్ అయ్యారు. ప్రస్తుతం అక్కడున్న స్టీఫెన్ రవీంద్ర బదిలీ అయ్యారు. ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. డీఎస్ చౌహాన్, స్టీఫెన్ రవీంద్రలను డీజీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు.బాధ్యతలను స్వీకరించిన అనంతరం శ్రీనివాసరెడ్డి విలేకరులతో మాట్లాడారు. డ్రగ్స్ రహిత నగరాన్ని తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కఠిన నిర్ణయాలను తీసుకుందని పేర్కొన్నారు. రేవ్, వీకెండ్ పార్టీల పేరుతో డ్రగ్స్‌ను వినియోగిస్తే సహించబోమని, డ్రగ్ పెడ్లర్స్‌ను ఉపేక్షించబోమని హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular