బిగ్ బాస్ ఫేమ్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ .
* గజ్వేల్ మండలం లోని కొల్గూర్ గ్రామంలోని తన ఇంటి వద్ద అదుపులో తీసుకున్న పోలీసులు
* ప్రశాంత్ ను జూబ్లీ హిల్స్ పోలీసులు అదుపులో తీసుకొని జూబ్లీ హిల్స్ పోలిస్ స్టేషన్ కు తరలించారు
బిగ్ బాస్ 7 విజేత, ప్రముఖ యూట్యూబర్ పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గ్రాండ్ ఫినాలే సందర్భంగా ఈనెల 17వ తేదీన హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద జరిగిన ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్‌కు స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు చేరుకున్న ఆయన అభిమానులు రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. ఆరు ఆర్టీసీ బస్సుల అద్దాలు పగలగొట్టారు. ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేయడంపై ఆర్టీసీ అధికారులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.




