రాజేంద్రనగర్ లో డ్రగ్స్ కలకలం రేగింది. ఓ మహిళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ముసుగులో ఎస్ ఒ టీ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు
ఈ మేరకు ఆమె నుంచి 8 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్ పోలీసుల కథనం ప్రకారం.. శివరాంపల్లి పిల్లర్ నెంబర్ 290 కెన్ వర్త్ అపార్ట్‌మెంట్ లో సంధ్య(26) అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ నివసిస్తుంది. ఆమెకు అమెజాన్ కంపెనీలో పని చేసే డేవిడ్ (27)తో పాటు అర్జున్(25) స్నేహితులు.
వీరు ముగ్గురు కలిసి బెంగళూరు నుంచి ఎండిఎంఏ డ్రగ్స్ 8 గ్రాములు తీసుకొచ్చారు. వీరు న్యూ ఇయర్ సందర్భంగా డ్రగ్స్ సేవించి విక్రయించి సొమ్ము చేసుకోవాలని భావించారు. డ్రగ్స్ విక్రయిస్తున్నారని విశ్వసనీయ సమాచారంతో ఎస్వోటీ పోలీసులు అపార్ట్మెంట్ లో దాడి చేశారు. వారి నుంచి 8 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 86,000 ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు సైబరాబాద్ ఎస్ఓటీ బృందం ముగ్గురు ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. పోలీసులు ఎన్ డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




