ఆరోగ్యానికి హానికరమైన రసాయనాన్ని ఉపయోగిస్తూ నకిలీ హెన్నా మెహందీని తయారు చేస్తున్న వ్యక్తిని డ్రగ్కంట్రోల్అధికారులు మంగళవారం అరెస్ట్‌చేశారు.
తయారీ యూనిట్‌నుంచి పెద్ద మొత్తంలో నకిలీ హెన్నా మెహందీని స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్కంట్రోల్అడ్మినిస్ర్టేషన్డైరెక్టర్జనరల్వీ.బీ.కమలాసన్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. మహ్మద్యూసుఫ్అనే వ్యక్తి మెహదీపట్నం ప్రాంతంలో ఎలాంటి లైసెన్స్‌లేకుండా షకీల్ఇండస్ర్టీపేరుతో ఫ్యాక్టరీ నడుపుతూ.. స్పెషల్కరాచీ మెహందీ కోన్లతో పాటు నకిలీ హెన్నా మెహందీ కోన్లను ఉత్పత్తి చేస్తూ రాష్ర్ట వ్యాప్తంగా సప్లయ్ చేస్తున్నాడు. ఈ మేరకు పక్కాగా సమాచారాన్ని సేకరించిన డ్రగ్కంట్రోల్అధికారులు మంగళవారం దాడి నిర్వహించి మహ్మద్యూసుఫ్ను అరెస్టు చేశారు. అనంతరం తయారీ కేంద్రం నుంచి పెద్ద మొత్తం నకిలీ మెహందీ కోన్లను సీజ్‌చేశారు. స్వాధీనం చేసుకున్న మెహందీని ల్యాబ్‌లో పరీక్షలు జరిపించగా ఆరోగ్యానికి హానికరమైన పిరామిక్యాసిడ్ను ఉపయోగించి మెహందీ కోన్లు తయారు చేసినట్లుగా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు నిందితునిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




