spot_img
Wednesday, March 25, 2026
spot_img

హైదరాబాద్ లో లవ్ జీహాద్ కలకలం

Love Jihad వ్యవహారం హైదరాబాద్‌లో కలకలం రేపుతోంది. ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని ఓ దళిత యువతి పోలీసులను ఆశ్రయించింది. బలవంతంగా మతం మార్చి తనను పెళ్లి చేసుకున్నాడని ఆరోపించింది.

హైదరాబాద్‌లో మరో లవ్ జిహాద్ వ్యవహారం కలకలం రేపుతోంది. రఫీక్ అనే యువకుడు ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని ఓ దళిత యువతి పోలీసులను ఆశ్రయించింది. బలవంతంగా తన మతం మార్చి పెళ్లి చేసుకొని అవసరం తీరాక వదిలేసి వెళ్లిపోయాడని ఆరోపించింది. ఈ మేరకు మల్కాజిగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందిబాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు.. వరంగల్‌కు చెందిన కృష్ణవేణి, రఫీక్ ఆరేళ్లు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత రఫీక్ ఆమె మతం మార్పించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత కృష్ణవేణి పేరును షబానాగా మార్పించాడు

బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు.. వరంగల్‌కు చెందిన కృష్ణవేణి, రఫీక్ ఆరేళ్లు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత రఫీక్ ఆమె మతం మార్పించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత కృష్ణవేణి పేరును షబానాగా మార్పించాడు.

మొదట్లో బాగానే ఉన్న రఫీక్ ఆ తర్వాత వేధించడం ప్రారంభించాడని బాధితురాలు తెలిపింది. గర్భం దాల్చిన తర్వాత పుట్టింటి నుంచి డబ్బులు తేవాలంటూ వేధింపులకు గురి చేశాడని ఆరోపించింది. నాలుగు సార్లు అబార్షన్ చేయించాడని తెలిపింది. తాజాగా మరోసారి తాను మరోసారి గర్భం దాల్చాక తనను విడిచిపెట్టి ఎక్కడికో వెళ్లిపోయాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

రఫీక్‌పై పోలీసులకు ఇప్పటికే నాలుగు సార్లు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు తెలిపింది. పోలీసులు కూడా అతణ్ని స్టేషన్‌కు పిలిపించి పలుమార్లు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పారిపోయిన రఫీక్ కోసం గాలింపు చేపట్టారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular