spot_img
Sunday, September 13, 2026
spot_img

ఆ 70వేల మందిపై “గుంటూరు కారం” టీమ్ కేసులు..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా హీరోయిన్స్ శ్రీలీల అలాగే మరో హాట్ బాంబ్ మీనాక్షి చౌదరి ల కలయికలో దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రమే ‘గుంటూరు కారం’.

కాగా ఈ సినిమా మహేష్ బాబు ఇంకా దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా కావడంతో మంచి హైప్ ఏర్పడి రిలీజ్ కి వచ్చింది.

కానీ అనుకున్న రేంజ్ లో సినిమాలో కంటెంట్ లేకపోవడంతో రెండో రోజు నుంచే సినిమాకి భారీ డ్రాప్ స్టార్ట్ అయ్యింది. దీనితో రెండు రోజుల్లో అఫీషియల్ గా 120 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకుంది. సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ సినిమాకి స్ప్రెడ్ అవుతున్న నెగిటివ్ టాక్ విషయంలో మాత్రం చిత్ర టీమ్ బాగా డిజప్పాయింట్ అయ్యారు.

తమ సినిమాపై చాలా నెగిటివ్ కావాలని చేస్తున్నారని అంటున్నారు. కాగా ఇదే కాకుండా ఆన్లైన్ బుకింగ్ యాప్ బుక్ మై షో లో అయితే పనిగట్టుకొని బాట్స్ తో నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారని వారిస్తున్నారు. అలా సినిమాకి కేవలం 1 రేటింగ్ ఇస్తున్న వారు మొత్తం 70 వేలకి పైగా గుర్తించామని దీనిపై సైబర్ కేసు పెడుతున్నటుగా లేటెస్ట్ గా సినీ వర్గాల్లో ప్రెస్ నోట్ వచ్చినట్టుగా తెలుస్తుంది. కాగా ఈ న్యూస్ విన్న కొందరు నెటిజన్లు మేము కూడా సినిమా నచ్చకే తక్కువ రేటింగ్ ఇచ్చినవాళ్ళం ఉన్నామని తమపై కూడా కేసులు వేస్తారా అంటూ అవాక్కవుతున్నారు. ఇక ఇక్కడ మరో లాజిక్ ఏమిటంటే బుక్ మై షోలో సినిమా చూడకుండా రేటింగ్ ఇవ్వడానికి దాదాపు ఉండదు.

అలాగే ఇప్పుడు వరకు ఒక లక్ష 40 వేల మందికి పైగా బుక్ మై షోలో రేటింగ్ ఇచ్చారు. ఇక అందులో 70 వేలు ఫేక్ అనుకుంటే కేవలం ఇప్పుడు వరకు ఇంకో 70 వేలు మంది మాత్రం సినిమా చూసారా? అంటే ఈ లెక్కన కూడా ఈ సినిమాని తక్కువ మందే చూసినట్టు కదా అనేది ప్రశ్న.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular