మక్తల్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో రాము (32) అనే వ్యక్తి కిటికీ ఊచలకు ప్లాస్టిక్ వైరుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది.
చనిపోయిన యువకునికి మొదటి భార్య ఉండగా నవిత(20) ప్రేమించి వారం రోజుల క్రిందటనే పేద్దల సమక్షంలో రెండో పెళ్లి చేసుకున్నాడు. భర్త రాము కనిపించక పోవడం తను ఊరికేళైళాని నవిత చేప్పింది. సోమవారం మక్తల్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో కిటికీకి ప్లాస్టిక్ వైర్‌తో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోగా మృతదేహాం వైరు తెగి కింద పడింది. బాలికల పాఠశాల వాచ్ మేన్ ఎండి కరీం గదులను క్లీన్ చేస్తుండగా ఈ మృతదేహాన్ని హెడ్‌మాస్టర్‌కు, పోలీసులకు సమాచారం వాచ్మెన్ కరీం సమాచారం ఇచ్కచారు. ఈ విషయం అందుకున్న మక్తల్ ఎస్ఐ పర్వతాలు సంఘటన స్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకొని శవాన్ని ఆస్పత్రికి తరలించారు.
రెండో భార్య నవిత కథనం ప్రకారం.. మక్తల్ నియోజకవర్గంలోని మాగనూరు మండలం కోల్పూర్ గ్రామానికి చెందిన నవిత గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యం చేందగా బాగు కోసం కర్ణాటక రాయచూర్ జిల్లా శక్తి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొర్తికోండ గ్రామంలో గట్టుపై కోలువైన తిమ్మప్ప దేవాలయంలో వారం రోజులు పూజలు చేయడానికి రాగ అదే గ్రామానికి చెందిన రాము అనే వ్యక్తితో పరిచయం ప్రేమగా మారి.. ఇద్దరు పారిపోయి ప్రేమ వివాహం చేసుకున్నామని తమను తీసుకొచ్చి ఇరు వర్గాల పెద్దలు కూర్చుని వారం రోజుల కిందట వారికి పెళ్లి జరిపించారు.




