తమ్ముడు ప్రేమ పెళ్లి చేసుకున్న గంటల వ్యవధిలో అన్న దారుణ హత్యకు గురైన ఘటన మెదక్ పట్టణంలోని నవాబ్ పేటలో జరిగింది
నవాబ్ పేటకు చెందిన పోతరాజ్ నగేష్(25) సోదరుడు ఉదయ్ పాల్ అదే కాలానికి చెందిన భవానినీ ప్రేమించాడు. ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇంట్లో వాళ్ళు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో భవాని, ఉదయ్ పాల్ ఆదివారం ఇంటి నుంచి వెళ్ళిపోయి హైదరాబాద్‌లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. యువతి సోదరుడు అంజిత్‌కు పెళ్లి ఇష్టం లేదు.
దీంతో ఆగ్రహించిన అంజీత్ సాయంత్రం ఉదయ్ పాల్ ఇంటికి వెళ్ళి ఘటన పడ్డాడు. ఇంటి వద్ద నగేష్ ఉండడంతో అతని పై కత్తితో దాడి చేసినట్లు స్థానికులు చెప్పారు. అడ్డుకోబోయిన వారికి కూడా కత్తి గాయాలయ్యాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి రక్తం కారుతున్న నగేష్‌ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. నగేష్ హత్యకు తమ్ముడి ప్రేమ పెళ్ళియే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి విచారణ జరుపుతున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు.




