spot_img
Wednesday, March 25, 2026
spot_img

హైదరాబద్ లో వివాహిత మిస్సింగ్ కలకలం

హైదరాబద్ లో వివాహిత మిస్సింగ్ కేసు కలకలం రేపుతోంది. ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్లిన భార్య తిరిగి ఇంటికి రాలేదు. దీనితో ఆ మహిళ భర్త పోలీసులను ఆశ్రయించారు

వివరాల్లోకి వెళ్తే.. బాలకృష్ణ అనే యువకుడికి కృష్ణ ప్రియ అనే యువతితో రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కాగా కృష్ణ ప్రియ, బాలకృష్ణ దంపతులు హైదరాబాద్ లోని పుప్పాల గూడలో నివాసం ఉంటున్నారు.

అయితే ఈ రోజు ఉదయం కృష్ణ ప్రియ తన భర్త బాలకృష్ణకు చెప్పకుండా ఇంటి నుండి బయటకు వెళ్ళింది. ఇక బాలకృష్ణ ఉద్యోగం నిమిత్తం ఆఫీస్ కి వెళ్లిపోయారు. అయితే మధ్యాహ్నం బాలకృష్ణ తన భార్య కృష్ణప్రియకు ఫోన్ చేశారు. ఎన్ని సార్లు కాల్ చేసిన కృష్ణ ప్రియ ఫోన్ తియ్యలేదు. దీనితో కంగారుపడిన భర్త భార్య ఆచూకీ కోసం చుట్టుపక్కల గాలించారు. అయిన ఫలితం లేకపోయింది. భార్య ఆచూకీ దొరకకపోవడంతో బాలకృష్ణ నార్సింగి పోలీసులను ఆశ్రయించారు. బాలకృష్ణ ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular