spot_img
Wednesday, March 25, 2026
spot_img

HMDA శివ బాలకృష్ణ కస్టడీ లో తెల్చనున్న ఏసీబి.. ఇప్పటికే బాలకృష్ణ ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం





హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఆస్తులు చూస్తుంటే కళ్లు బైర్లు కమ్మేలా చేస్తుంది ఏసీబీ అధికారులు… తవ్వే కొద్దీ కోట్లు రూపాయలు ఆస్తులు బయట పడుతున్నాయి… ఇక శివ బాలకృష్ణ చేతిలో మోసపోయిన వారు, అలాగే కమీషన్లు కు కక్కుర్తి పడి ఇష్టారాజ్యంగా అనుమతులిచ్చారని ఏసీబీ కార్యాలయం లో భాదితులు ఫిర్యాదు చేశారు… ఇకఇప్పటికే శివ బాలకృష్ణ ను 8 రోజుల పాటు కస్టడీ అనుమతించింది నాంపల్లి ఏసీబీ కోర్ట్ …కస్టడీలో శివ బాలకృష్ణ బినామీ ఆస్తులు, బ్యాంక్ లాకర్లు పై ఏసీబీ ఫోకస్ చేయనుంది.. భారీ అవినీతికి పాల్పడ్డ బాలకృష్ణను సస్పెండ్ చేసిన ప్రభుత్వం..

హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కు ఏసీబీ అధికారులు క‌స్ట‌డీకి కోర్టు అనుమ‌తి ఇచ్చింది.. కస్టడీ పిటిషన్‌పై నాంపల్లి ఏసీబీ స్పెషల్ కోర్టు విచారణ జరిపింది. 10 రోజుల కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో ఏసీబీ పిటిషన్ దాఖలు చేయగా, 8 రోజుల కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది.ఇక ఈ కేసులో బినామీల విచారణ, ఆస్తులపై దర్యాప్తు చేయాలన్న ఏసీబీ భావిస్తుంది… ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేసింది. అధికారులను సైతం ఏసీబీవిచారించనుంది.హెచ్‌ఎండీఏ, రేరా, మెట్రోలో జరిగిన అక్రమాలపై ఏసీబీ ఆరా తీయనుంది. హైరేస్ బిల్డింగ్ అనుమతుల్లో అక్రమాలపై విచారణ చేయనుంది. ఇక కోర్టులను సైతం తప్పుదోవ పట్టించి వివాదస్పద భూముల్లో అనుమతులు ఇచ్చినట్లు ఏసీబీకి పలు ఫిర్యాదులు అందాయి. దీంతో ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పుప్పాలగూడ 447సర్వే నంబర్‌లో అనుమతులపై సూర్య ప్రకాష్ అనే వ్యక్తి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే 100 కోట్ల విలువైన బాలకృష్ణ అక్రమ ఆస్తులను గుర్తించారు. బాలకృష్ణను కస్టడీకి తీసుకుని విచారిస్తే అక్రమ ఆస్తులు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ అవినీతి బాగోతం వెనుక టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కొందరు రాజకీయ నాయకుల అండ ఉందనే విషయం మీద కూడా ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టారు..రాజశేఖర్ రెడ్డి,శ్రీనివాస్ గౌడ్ లు బాలకృష్ణపై ఎలాంటి అవినీతి ఆరోపణ కేసులు పెట్టకుండా అడ్డుకున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు

ఇక HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అవినీతి అక్రమాల పై తెలంగాణ ఏసీబీ ప్రధాన కార్యాలయంలో సూర్యప్రకాష్, బాలకృష్ణ అనే ఇద్దరు బాధితులు ఫిర్యాదు చేశారు…
శివబాలకృష్ణ అధికారం అడ్డుపెట్టుకొని ఎన్నో అక్రమనిర్మాణాలను ప్రోత్సహిస్తు పర్మిషన్స్ ఇచ్చారని ఫిర్యాదు లో పేర్కొన్నారు…ఉప్పలగూడలో సర్వేనెంబర్ 447 లో ఆరు ఎకరాల 36 గుంటలు భూవివాదం ఉండేదని, అయితే ఇల్లిగల్ గా టెక్నికల్ అప్రవల్ పర్మిషన్ ఇచ్చారని ఫిర్యాదు చేశారు… 2022 లో హైకోర్టు కేసు నడుస్తుండగా శివబాలకృష్ణ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారని, అయితే తప్పుడు అఫిడవిట్ వేసి తమకు అన్యాయం చేశాడని భాదితులు ఆవేదన వ్యక్తం చేశారు… శివ బాలకృష్ణ వేసిన కౌంటర్ అఫిడవిట్ పూర్తిగా అసంబద్ధంగా ఉందని తెలిపారు..రఘురాంప్రదీప్ కన్స్ట్రక్షన్స్ కు నోటీసు ఇచ్చిన రోజు పర్మిషన్ ఇచ్చారని తెలిపారు… అనైతికంగా ప్రాజెక్టు యజమానులతో కుమ్మకై డబ్బులు తీసుకొని ప్రాజెక్ట్ కు అనుమతులు ఇచ్చారని తెలిపారు…
కన్స్ట్రక్షన్ నోటీస్ విషయంలో నేను ఫిర్యాదు చేశాను వివరణ అడిగాను కానీ ఇప్పటి వరకు స్పందన రాలేదని తెలిపారు.. ఈ శివ బాలకృష్ణ కోర్టు ను సైతం తప్పుదోవ పట్టించారని తెలిపారు…ఇలా ప్లాట్ కొనుగోలు దారులకు ఆన్ రిజిస్టర్డ్ అగ్రిమెంట్ చేస్తూ మోసం చేశారని పేర్కొన్నారు…
90శాతం పే చేసిన కొనుగోలు చేసిన ఫ్లాట్ యజమానులకు రిజిస్ట్రేషన్ చేయలేదని వాపోయారు… ఇక శివ బాలకృష్ణ పని చేసిన సమయంలో ఎన్ని ప్రాజెక్టులకు అనిమతులు ఇచ్చాడు.. ఆ సమయంలో బాలకృష్ణ సహకరించిన ప్రభుత్వ అధికారుల పైన కూడా ఏసీబి అధికారులు నిఘా పెట్టారు అందులో సహకరించిన అందరి అవినీతి పై కూడా విచారణ చేయనున్నారు… సంబంధిత ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని పరిశీలించాలని ఏసీబీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం…
HMDA నుండి ఫైల్స్ ను తెప్పించుకొని విచారణ చేయాలని ఏసీబీ నిర్ణయం తీసుకుంది…ఇక 10 % మార్టిగేజ్ రూల్ చూపి రిజిస్ట్రేషన్ లేకుండా పోసెషన్ లోకి పంపించారని విచారణ లో తేలింది.. పుప్పాల గూడ లో వేయి కోట్లు ప్రాజెక్ట అనుమతులపై అవకతవకలతో పాటు మరి కొన్ని ప్రాజెక్టులపై అవినితీ ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఈ కేసును సుదీర్ఘంగా విచారణ చేయనున్నారు అధికారులు… ఇక ఇప్పటికే
HMDA ఫైల్స్ ఇవ్వాలని HMDA అధికారులకు ఏసీబీ అధికారులు లేఖ రాసినట్లు సమాచారం.. ఇక గతవారం శివ బాలకృష్ణ ను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు… కానీ శివ బాలకృష్ణ కుటుంబ సభ్యులు కూడా విచారణ కు సహకరించలేదు .. దీంతో బినామీ ఆస్తుల తో పాటు కుటుంబ సభ్యులను సైతం విచారణ చేయున్నారు ఏసీబీ అధికారులు… ఇక మూడేళ్లు తరువాత ఒక కేసులో ఏసీబీ అధికారులు కస్టడీ కి తీసుకొని విచారించడం మొదటి సారి అవుతుంది..2020 లో కీసర తహసీల్దార్ నాగరాజు అలాగే మరికొంత మంది అరెస్ట్ తరువాత కస్టడీకి తీసుకొని విచారణ చేశారు ఏసీబీ అధికారులు..ఈ కేసులో నిందితుల గా ఉన్న తహశీల్దార్ నాగరాజు, ధర్మారెడ్డి ఇద్దరు తీవ్ర మనస్తాపం తో ఆత్మహత్యలు చేసుకొని మృతి చెందారు… మూడేళ్లు తరువాత అదే స్థాయి కేసు ఇప్పుడు HMDA మాజీ డైరెక్టర్ పై అవినీతి ఆరోపణలు , ఆదాయానికి మించి ఆస్తుల కేసు వెలుగు లోకి రావడం తో ఏసీబీ అధికారులు తీగ లాగుతున్నారు. కానీ డొంక కదిలేలా చేస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది…ఇక జ్యూడిషియల్ రిమాండ్ లో లో ఉన్న శివ బాల కృష్ణ ను బుదవారం ఉదయం 10 గంటలకు కస్టడీకి తీసుకొని బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయనికి తరలించి విచారణ చేయనున్నారు.. ఇప్పటికే బాలకృష్ణ అవినీతి బాగోతంపై అనేక సాక్షాలు స్వీకరించిన ఏసీబీ వాటిని ప్రూవ్ చేసే పనిలో పడింది గత ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా అవినీతి పాల్పడిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బాలకృష్ణ సస్పెండ్ చేసింది బాలకృష్ణతోపాటు ఆయనకు సహకరించిన అధికారుల పైన కూడా చర్యలు ఉండే అవకాశం ఉంది వీళ్లలో రాజశేఖర్ రెడ్డి దేవేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పేర్లు కూడా ప్రముఖంగా కనిపిస్తున్నాయి వీళ్లే కాక టిఆర్ఎస్ లో కీలకమైన పదవుల్లో ఉన్న వ్యక్తుల ప్రమేయంపై కూడా ఏ సి బి ఆరాతిస్తుంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular