spot_img
Tuesday, March 24, 2026
spot_img

తాగిన మత్తులో కండెక్టర్ ను కాలితో తన్నిన యువతి, సజ్జనార్ సీరియస్!

క్రమ శిక్షణతో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తోన్న తమ సిబ్బందిపై కొందరు దాడులకు దిగడాన్ని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) యాజమాన్యం తీవ్రంగా ఖండించింది రోజూ సగటున 55 లక్షల మంది ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తోన్న సిబ్బందిపై దుర్భాషలాడుతూ దాడులు చేయడం ఏమాత్రం సమంజసం కాదని పేర్కొంది. టీఎస్ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటకం కలిగించే, దాడులకు పాల్పడే వ్యక్తులపై చట్టప్రకారం చర్యలుంటాయని, పోలీస్ శాఖ సహకారంతో నేరస్థులపై హిస్టర్ షీట్స్ తెరిచేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సిబ్బందిలో ఆత్మస్థైర్యం దెబ్బతీసే ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఏమాత్రం ఉపేక్షించబోమని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది.

టీఎస్ఆర్టీసీ కండక్టర్లపై ఇటీవల మూడు చోట్ల మహిళలు దాడులకు పాల్పడ్డారు. హయత్ నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై నానా దుర్బాషలాడుతూ వేర్వేరుగా దాడికి దిగారు. చిల్లర విషయంలో ఒక మహిళ, గుర్తింపు కార్డును చూపించి జీరో టికెట్ ను తీసుకోవాలని కండక్టర్ చెప్పినందుకు కండెక్టర్ సెల్ ఫోన్ లాక్కుని అసభ్యపదజాలంతో మరొక మహిళ దూషించారు. పికెట్ డిపోకు చెందిన మహిళా కండక్టర్ పై కొందరు మహిళలు సాముహికంగా దాడి చేశారు. పై మూడు ఘటనలపై రాచకొండ కమిషనరేట్‌ లోని సంబంధిత పోలీస్ స్టేషన్ లలో టీఎస్ఆర్టీసీ అధికారులు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. ఆ కేసుల దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతోందని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని టీఎస్ఆర్టీసీ పేర్కొంది. హయత్‌నగర్ డిపో ఆర్టీసీ బస్సులో ఓ యువతి మద్యం మత్తులో వీరంగం చేసింది. తనకు చిల్లర ఇవ్వలేదని కండక్టర్‌ను దుర్భాషలాడుతూ కాలితో తన్నింది. కండక్టర్ సహా తోటి ప్రయాణికులు ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించిన మద్యం మత్తులో అసభ్య పదజాలంతో రెచ్చిపోయింది. ఈ ఘటనపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందిస్తూ… నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఏమాత్రం ఉపేక్షించబోమన్నారు.

టీఎస్ఆర్టీసీ నిబంధనల ప్రకారమే సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని, నిబంధనల మేరకే టికెట్ల జారీ ప్రక్రియను కండక్టర్లు కొనసాగిస్తున్నారని సంస్థ తెలిపింది. ప్రయాణికులు ఒక వేళ టికెట్ తీసుకోకుంటే అది చెకింగ్ లో గుర్తిస్తే ఆ సిబ్బంది ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రయాణ సమయంలో విధిగా టికెట్ తీసుకుని సిబ్బందికి సహకరించాలని టీఎస్ఆర్టీసీ విజ్ఞప్తి చేస్తోంది. మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని సిబ్బంది సమర్థవంతంగా అమలు చేస్తున్నారని, ఓపిక, సహనంతో విధులు నిర్వర్తిస్తూ ప్రతి రోజూ సగటున 27 లక్షల మంది మహిళా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నారని ఆర్టీసీ స్పష్టం చేసింది. ఒరిజనల్ గుర్తింపు కార్డు తప్పనిసరి అని సిబ్బంది చెబుతున్నా…..కొందరు ఇప్పటికీ ఫొటో కాపీలను, స్మార్ట్ ఫోన్ లలో గుర్తింపు కార్డులను చూపిస్తున్నారని అలాంటి వాటికి అనుమతి లేదని సంస్థ తేల్చి చెప్పింది.ఈ దాడి ఘటనలు సిబ్బందిలో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడంతో పాటు మనోవేదనకు గురిచేస్తున్నాయని టీఎస్ఆర్టీసీ తెలిపింది. మహాలక్ష్మి స్కీంను వినియోగించుకోవాలంటే కచ్చితంగా ఒరిజినల్ గుర్తింపు కార్డును సిబ్బందికి చూపించి…..విధిగా జీరో టికెట్ ను తీసుకోవాలని టీఎస్ఆర్టీసీ సూచిస్తోంది. ప్రయాణికులు తమ ఫిర్యాదులు, సమస్యలను సంస్థ దృష్టికి తీసుకువచ్చేందుకు కేంద్ర కార్యాలయం బస్ భవన్ లో పటిష్టమైన వ్యవస్థను సంస్థ ఏర్పాటు చేసింది. అక్కడ 24 గంటల పాటు అందుబాటులో ఉండే టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లైన 040-69440000, 040-23450033 కాల్ చేసి సమస్యలను చెప్పవచ్చని కోరింది. ఫిర్యాదులను సోషల్ మీడియా ద్వారా సంస్థ దృష్టికి రావొచ్చు. అలాగే, నేరుగా సమీపంలోని డిపో కార్యాలయాలకు వెళ్లి వివరించవచ్చు. ఫిర్యాదు సంస్థ దృష్టికి వెంటనే స్పందించి తగిన చర్యలను అధికారులు తీసుకుంటారు. అంతేకానీ, సహనం కోల్పోయి ఈ తరహా ఘటనలకు పాల్పడటం సరైంది కాదని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular