వెళ్ళిపోతున్నాం.. క్షమించండి అంటూ శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థినులు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. స్టూడెంట్స్ ఆత్మహత్య అనంతరం సూసైడ్ నోట్ లభ్యం అయింది.
విద్యార్థులు సూసైడ్ నోట్‌లో చనిపోయిన ఇద్దరు విద్యార్థుల్ని ఒకటే దగ్గర పూడ్చాలని వారు చివరి కోరిక అని పేర్కొన్నారు. చేయని తప్పుకు అందరూ మమ్మల్ని అనడం భరించలేక పోతున్నామని రాశారు. వార్డెన్ శైలజ మేడం మంచిదని, సొంత అమ్మ కంటే ఎక్కువగా చూసుకుందని ఆమెను ఎవరూ ఏం అనొద్దు ప్లీజ్ అని కోరారు. స్టూడెంట్స్‌ని శైలజ మేడం తప్ప ఎవ్వరూ నమ్మడం లేదని, చెయ్యని తప్పుకి మనస్థాపానికి గురయ్యామని తెలిపారు. వారి బాధ ఎవ్వరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని సూసైడ్ నోట్‌లో విద్యార్థినులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.




